తగ్గినట్లే తగ్గి.. | Petrol Prices Hikes on Festival Season | Sakshi
Sakshi News home page

తగ్గినట్లే తగ్గి..

Jan 15 2019 11:21 AM | Updated on Jan 15 2019 11:21 AM

Petrol Prices Hikes on Festival Season - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: పండుగ వేళ పెట్రో ధరలు పై పైకి ఎగబాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టిన  దేశీయంగా  ముడిచమురు ఉత్పత్తుల ధరలు నానాటికి భారంగా మారుతున్నాయి. గత మూడు నెలల అనంతరం మహీల్ల పెట్రో ధరలు దూకుడు పెంచాయి. పెట్రోల్, డీజిల్‌ ధరలు పోటా పోటీగా పెరుగుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో పైసా పైసా పెరుగుతూనే లీటర్‌ పెట్రోల్‌ పై సుమారు రూ.2 వరకు, డీజిల్‌పై రూ.2.20 పైసలు పెరిగాయి. సరిగ్గా గత వారం రోజుల క్రితం  స్వల్పంగా పెరిగి ఆ తర్వాత రెండు రోజుల పాటు నిలకడగా ఉన్న పెట్రో ధరలు  ఆ తర్వాత విజృంభించాయి. పలు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌ ధరలను లీటర్‌కు 20 నుంచి 53 పైసల మధ్య, డీజిల్‌ ధరలు లీటర్‌కు 30 నుంచి 64 పైసల పెంచుకుంటూ వస్తున్నాయి. సోమవారం నాటికి హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌ రూ. 74.40పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు రూ 69.77 పైసలకు చేరింది. మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మళ్లీ విజృంభణ...
అసెంబ్లీ ఎన్నికల మందు తగ్గు ముఖం పట్టిన పెట్రోల్, డీజిల్‌ ధరల  మళ్లీ విజృంభిస్తున్నాయి.  రోజువారి ధరల సవరణ ప్రక్రియలో గత నాలుగు మాసాల క్రితం వరకు హడలెత్తించిన పెట్రోల్, డీజిల్‌ ధరలు వెనక్కి తగ్గినట్లే తగ్గి అంతర్జాతీయ మార్కెట్‌ చమురు«  ధరలు తగ్గు ముఖం పట్టినా మళ్లీ  ఎగబాగుతున్నాయి. నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లో  పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 89.06 చేరుకుని ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. అదేబాటలో డిజిల్‌ ధర కూడా ఎగబాకి దేశంలోనే రికార్డు సృష్టించింది. అప్పట్లో  లీటర్‌ డీజిల్‌ ధర రూ.82.33 పైసలు పలికింది.

వినియోగంలో టాప్‌...
హైదరాబాద్‌ మహా నగరం పెట్రోల్, డీజిల్‌ వినియోగంలో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం మొత్తం మీద సగం వినియోగం నగరంలోనే జరుగుతోంది.  నగరంలో సుమారు 50 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, మరో పది లక్షల వరకు వాహనాల వరకు  నగరానికి రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో  మూడు ప్రధాన ఆయిల్‌ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్‌ బంకుల ఉండగా వాటి ద్వారా ప్రతి రోజు 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. ఆయిల్‌ కంపెనీల టెర్మినల్స్‌ నుంచి ప్రతిరోజు పెట్రోల్‌ బంకులకు  150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కో ట్యాంకర్‌ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement