
సాక్షి, సిటీబ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. పశ్చిమాసియా ప్రాంతాలైన అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలపై పడింది. దీంతో గత పది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఫలితంగా పెట్రోల్, డీజిల్‌పై ఒక్క రూపాయి వరకు పెరిగినట్లయింది. దీంతో మంగళవారం నాటికి హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.80.54 పైసలు, డీజిల్ లీటర్ ధర రూ.75 లకు చేరింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయంగా క్రూడాయిల్‌పై పడి పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100కు చేరువయ్యే అవకాశాలున్నాయి విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మధ్యతరగతి ప్రజలపై భారం తీవ్రంగా పడే అవకాశం ఉంది. అలాగే నిత్యావసరాల ధరలూ పెరుగుతాయి
Comments
Please login to add a commentAdd a comment