సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో సెగలు కొనసాగుతున్నాయి. ముడిచమురు ధరల భారంతో పాటు రూపాయి క్షీణించడంతో ఇంధన ధరలు సరికొత్త గరిష్టస్ధాయిలకు చేరాయి. లీటర్ పెట్రోల్ రూ వంద దిశగా పరుగులు పెడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 89.29కి చేరగా డీజిల్ ధర లీటర్‌కు రూ 78.26కు పెరిగింది.
హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ 86.25 పలికింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ 81.91కు పెరగ్గా, డీజిల్ ధరలు లీటర్‌కు రూ 73.32కు చేరాయి. ముంబైలో శనివారం తొలిసారిగా పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 80కి చేరడంతో ఇంధన ధరల రికార్డు పెరుగుదలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇంధన ధరలకు చెక్ పెట్టేందుకు రూపాయిని బలోపేతం చేసే చర్యలు చేపట్టడంతో పాటు, పెట్రో ఉత్పత్తులపై పన్ను భారాలు తగ్గించాలనే డిమాండ్ ఊపందుకుంది. aasss
Comments
Please login to add a commentAdd a comment