బియ్యం, గోధుమ, వంటనూనెల ధరలు తగ్గుతున్నా..రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.వాహనదారులు బండ్లను బయటకు తీయాలంటే జంకుతున్నారు.దీంతో నిత్యవసర ధరలతో పాటు పెట్రో ధరల్ని తగ్గించాలని కోరుకుంటున్నారు.
ఇక శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వరుసగా ఐదోరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.ముంబై వంటి ప్రధాన నగరాల్లో డీజిల్ ధర కూడా పెట్రోల్‌తో పోటీ పడీ మరి పెరిగిపోతోంది. శనివారం రోజు లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై 35పైసలు పెరిగాయి.
దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.82 ఉండగా డీజిల్ ధర 100.29 ఉంది
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 103.84 ఉండగా డీజిల్ ధర రూ.92.47 ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.27 ఉండగా డీజిల్ ధర రూ.96.93 ఉంది
కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 104.52 ఉండగా డీజిల్ ధర రూ.95.58 ఉంది
హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.108.02 ఉండగా డీజిల్ ధర రూ.100.89 ఉంది
బెంగళూరులో పెట్రోల్ ధర రూ.107.77 ఉండగా డీజిల్ ధర రూ.98.15 ఉంది.
Comments
Please login to add a commentAdd a comment