భారంగా బతుకుబండి | 2013 review | Sakshi
Sakshi News home page

భారంగా బతుకుబండి

Published Sun, Dec 29 2013 2:31 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM

2013 review

ఈ ఏడాది అన్ని వర్గాల ప్రజల బతుకు బండి భారంగా సాగింది. చీటికి మాటికి విద్యుత్ చార్జీల పెంపు, పూటకో తీరుగా సర్దుబాటు, సర్‌చార్జీల మోతతో విద్యు త్‌శాఖ అధికారులు హడలెత్తించారు. దీని కితోడు బస్సు చార్జీల పెంపు, విద్యార్థుల బస్ పాస్ చార్జీల పెంపుతో బస్సు ప్ర యా ణం కూడా భారమైంది. మరో పక్క బి య్యం, ఉప్పులు, పప్పులు, కూరగాయల వంటి నిత్యావసరాల ధరలు చుక్కలను తా కాయి. మొత్తం మీద ఈ ఏడాది ప్రభుత్వ వడ్డింపులు, ధరల పెంపుతో జిల్లా ప్రజలపై వందల కోట్లకుపైగా అదనపు భారం పడినట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  2013 సంవత్సరం బడుగు జీవులకు తీపి కంటే చేదునే ఎక్కువగా మిగిల్చింది.
 
 నిత్యం పెట్రో పేలుళ్లు
 పెట్రో ధరలపై కేంద్రం నియంత్రణ ఎత్తివేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా పెట్రో, డీజిల్ ధరలు పలు మార్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. జిల్లాలో ఏప్రిల్ నెలలో రూ.73 ఉన్న లీటర్ పెట్రోల్ సెప్టెంబర్‌లో రూ.82.72కు పెరిగి గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం రూ.77.22కు తగ్గింది. ప్రస్తుత డీజిల్ ధర రూ.58.73కు చేరుకుని గరిష్ట స్థాయికి ఎగబాకింది. ప్రతి నెలా సగటున 12,000 కిలో లీటర్ల డీజిల్, 4,500 కిలో లీటర్ల పెట్రోల్ అమ్మకాలు జరుగుతున్నాయి.  పెట్రోల్‌పై రూ.20 కోట్లు, డీజిల్‌పై రూ.3.5 కోట్ల వరకు జిల్లా ప్రజలు అదనపు భారాన్ని మోసినట్లు అంచనా.
 
 ఆర్టీసీ ‘సెస్సు’బుస్సు..
 సెస్సు పేరిట ఆర్టీసీ ప్రయాణికులపై భారం మోపింది. గత జూలై 4 నుంచి ప్రతి టికెట్‌పై అదనంగా రూపాయి సెస్సు వసూలు చేస్తోంది. పల్లెవెలుగు మినహాయించి ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారిని బాదేసింది. దీంతో మెదక్ రీజియన్ పరిధిలో ప్రయాణికులపై నెలకు రూ.కోటి చొప్పున ఈ ఆరు నెలల్లో రూ.6 కోట్లకు పైగా అదనపు భారం పడింది.
 
 రోజూ కూర‘గాయాలు’
 నిత్యావసర సరుకుల ధరలు రాకెట్ వేగంతో ఆకాశంలోకి దూసుకెళ్లాయి. ప్రధానంగా కూరగాయల అంగడికి వెళ్లిన ప్రతిసారీ సామాన్యుడి జేబులకు చిల్లులు పడ్డాయి. ఒక్కో కూరగాయ కిలో ధర రూ.50 నుంచి రూ.90 వరకు పలికింది. ఒకానొక దశలో కిలో టమాటా రూ.80, ఉల్లీ రూ.90, అల్లం రూ.150, వెల్లుల్లి రూ.200, మిరప రూ.60కి చేరడంతో సామాన్యుడి కంట్లో నీళ్లు తిరిగాయి. ఇప్పటికీ కిలో కూరగాయల ధరలు రూ.50 చుట్టూ తిరుగుతున్నాయి.
 
 కరెంట్‌‘చార్జీ’ రూ.96 కోట్లు..సరు‘్దపోటు’ రూ.45.95 కోట్లు..
 
 విద్యుత్ చార్జీల పెంపునకు ఇంధన సర్దుబాటు చార్జీల వడ్డన తోడవడంతో బిల్లులు చూసి వినియోగదారులు ఘోల్లుమన్నారు. జిల్లాలో 8.79 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. ప్రతి నెలా 60 నుంచి 75 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. పెరిగిన చార్జీల వల్ల జిల్లా ప్రజలపై ప్రతి నెలా రూ.8 కోట్ల చొప్పున ఏడాదికి రూ.96 కోట్ల అదనపు భారం పడింది. ఇక ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో మరో రూ.45.95 కోట్ల భారం పడింది. గృహ వినియోగదారులతోపాటు పరిశ్రమల యజమానులు ప్రతి నెలా షాక్‌కు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement