Surcharge
-
రూ.100 గెలిస్తే ఇచ్చేది మాత్రం రూ.68!
నిత్యం దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ఫలానా వ్యక్తి లాటరీ గెలుచుకున్నారని వింటూంటాం. ఒకవేళ ఆ వ్యక్తి రూ.100 లాటరీ ద్వారా గెలుపొందితే ట్యాక్స్‌లు పోను తనకు చివరకు అందేది దాదాపు రూ.68 మాత్రమే. మిగతా రూ.32లు వివిధ ట్యాక్స్‌ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అసలు లాటరీ పొందిన వారికి ఎలాంటి ట్యాక్స్‌లు విధిస్తున్నారు. అది ఎంత మొత్తంలో కట్టాల్సి ఉంటుందో తెలుసుకుందాం.కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషా అనే స్కూటర్ మెకానిక్ ఇటీవల ఏకంగా రూ.25 కోట్ల లాటరీ గెలుపొందారు. కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో పాల్గొనేందుకు రూ.500 పెట్టి టికెట్ కొన్నారు. ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అందులో అల్తాఫ్ ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వ ట్యాక్స్‌లో పోను చివరకు తనకు అందేది మాత్రం సుమారు రూ.17.25 కోట్లు కావడం గమనార్హం. అంటే రూ.7.8 కోట్లమేర ట్యాక్స్ కట్ అవుతుంది.ఇదీ చదవండి: ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటాట్యాక్స్లు ఇలా..ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194బీ కింద లాటరీలో గెలుపొందిన డబ్బుపై 30 శాతం పన్ను చెల్లించాలి. ఈ 30 శాతం పన్నుపై అదనంగా మరో నాలుగు శాతం వరకు సర్‌ఛార్జీ, సెస్ రూపంలో ట్యాక్స్ కట్టాలి. దాంతో మొత్తం సమకూరిన సొమ్ముపై 31.2 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సర్‌ఛార్జీ, సెస్‌ను ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, విద్యకు వెచ్చించాల్సి ఉంటుంది. ముందుగానే సదరు లాటరీ సంస్థలు టీడీఎస్(మూలం వద్ద పన్ను కోత) రూపంలో పన్ను కట్ చేసుకుని మిగతా డబ్బు విజేతలకు ఇస్తారు. లాటరీ ద్వారా గెలుపొందిన డబ్బు రెగ్యులర్ ఇన్కమ్ కిందకు రాదు. అది ‘ఇతర ఆదాయం’ విభాగంలోకి వస్తుంది. కాబట్టి బీమాకు సంబంధించిన 80డీ కింద ప్రభుత్వం గరిష్టంగా ఇచ్చే రూ.50 వేలు, 80సీ కింద ఇచ్చే రూ.1.5 లక్షలు పన్ను వెసులుబాటుకు అనర్హులుగా పరిగణిస్తారు. -
ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఆఫర్లు
భారత్‌లో క్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్య పెరుగుతోంది. 2023 ఏప్రిల్ నాటికి 8.60 కోట్ల క్రెడిట్ కార్డులు వాడకంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 ప్రారంభం నాటికి వీటి సంఖ్య 10 కోట్లకు చేరవచ్చని అంచనా. ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు వీటిని అందిస్తున్నాయి. అయితే కేవలం ఆర్థిక అవసరాలకే ఈ కార్డులను వాడుతుంటారు. బ్యాంకులు ఆయా కార్డులపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్, వోచర్లు, సర్ఛార్జ్ మినహాయింపులు.. వంటి ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తాయి. కానీ వీటికి సంబంధించి చాలామంది వినియోగదారులకు సరైన అవగాహన ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని బ్యాంకులు అందిస్తున్న క్రెడిట్ కార్డులపై ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.కొటక్ ఫార్చ్యూన్ గోల్డ్ క్రెడిట్ కార్డుఈ కార్డును బిజినెస్ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఇంధనం, టికెట్ బుకింగ్ మొదలైన వాటిపై ప్రాథమిక క్రెడిట్ కార్డు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కార్డుతో ఒక సంవత్సరంలో రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తే, నాలుగు పీవీఆర్ టికెట్లు లేదా రూ.750 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. రూ.500-రూ.3,000 ఇంధన లావాదేవీలపై 1% సర్ఛార్జ్ మినహాయింపును పొందే అవకాశం ఉంది.అమెజాన్ పే-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుషాపింగ్ అవసరాలకు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ఎక్కువగా వాడుతుంటారు. రోజువారీ కొనుగోళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రెడిట్ కార్డు ఉన్న కస్టమర్లు కలినరీ ట్రీట్స్ ప్రోగ్రామ్ ద్వారా భారత్‌లోని 2,500 కంటే ఎక్కువ రెస్టారెంట్స్‌లో డైనింగ్ బిల్లులపై 15% ఆదా చేసుకోవచ్చు. 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు పొందే అవకాశముంది. పొందిన రివార్డులపై పరిమితి, గడువు తేదీ లేదు. అమెజాన్‌లో రివార్డు పాయింట్లను రెడీమ్ చేసుకోవచ్చు. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉంటే అమెజాన్ ఇండియాలో కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.ఏయూ ఎల్ఐటీ క్రెడిట్ కార్డుఏయూ స్మాల్‌ఫైనాన్స్ బ్యాంక్ అందిస్తున్న ఈ కార్డు వల్ల దేశీయ, అంతర్జాతీయ ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిటైల్ లావాదేవీలపై 5X, 10X రివార్డు పాయింట్లను పొందొచ్చు. 90 రోజుల కాలవ్యవధిలో మూడుసార్లు 2-5% క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. ఖర్చు చేసిన ప్రతి రూ.100కు 1 రివార్డు పాయింట్‌తో పాటు మీ రిటైల్ లావాదేవీల కోసం 2-5% క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి అవకాశముంది. రూ.400-రూ.5000 మధ్య ఇంధన లావాదేవీలపై 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు పొందొచ్చు. ప్రతి 3 నెలలకు నాలుగు సార్లు విమానాశ్రయ లాంజ్‌లకు యాక్సెస్ పొందేవీలుంది.షాపర్స్ స్టాప్-హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుఈ కార్డుతో ప్రతి కొనుగోలుపై రివార్డ్స్ పొందొచ్చు. కార్డుదారులు షాపర్స్ స్టాప్ ప్రైవేట్ లేబుల్ బ్రాండ్లపై ఖర్చు చేసే ప్రతి రూ.150 కొనుగోలుపై 6 ఫస్ట్ సిటిజన్ పాయింట్లు వస్తాయి. రూ.500 విలువైన షాపర్స్ స్టాప్ వోచర్‌ను పొందొచ్చు. దీంతో షాపర్స్ స్టాప్ స్టోర్‌లో కనీసం రూ.3000 కొనుగోలు చేసినప్పుడు ఆ వోచర్‌ను రెడీమ్ చేసుకోవచ్చు. కార్డుపై ఒక సంవత్సరంలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే, 2000 ఫస్ట్ సిటిజన్ పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది. రూ.400-5000 మధ్య ఇంధన లావాదేవీలపై 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు ఉంది.యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డుఈ కార్డు ద్వారా చేసే అన్ని కొనుగోళ్లపై ఎడ్జ్ రివార్డ్ పాయింట్లను పొందడంతో పాటు పేటీఎం, మింత్ర, జొమాటో వంటి భాగస్వామ్య బ్రాండ్లపై రాయితీలు ఉంటాయి. బుక్‌మైషో ద్వారా సినిమా టిక్కెట్లు కొనుగోలు చేస్తే, 10% డిస్కౌంట్ లభిస్తుంది. ప్రతి రూ.200 ఖర్చుపై ఒక రివార్డు పాయింట్ పొందవచ్చు. -
AICPDF: ఎఫ్ఎంసీజీ.. అన్నేసి ప్యాక్‌లు వద్దు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసం తక్కువ ధరల ప్యాక్‌లను ప్రవేశపెట్టడం వల్ల ప్రస్తుత నెట్‌వర్క్‌పై అదనపు భారం పడినట్టు పంపిణీదారులు పేర్కొంటున్నారు. ప్యాకింగ్ సైజులను నాలుగు ప్రధాన కేటగిరీలుగా ప్రామాణీకరించాలని కోరుతున్నారు. ఆరంభ ప్యాక్, చిన్న ప్యాక్, మధ్యస్థ ప్యాక్, పెద్ద ప్యాక్ ఇలా నాలుగు విభాగాలుగా ఉండాలని ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫెడరేషన్ (ఏఐసీపీడీఎఫ్) డిమాండ్ చేసింది. గ్రామీణ మార్కెట్లలో విక్రయాలు పెంచుకునేందుకు ఇటీవలి కాలంలో పలు ఎఫ్ఎంసీజీ కంపెనీలు తక్కువ ధరల ప్యాక్‌లను ప్రవేశపెట్టాయి. దీంతో ధరల పరంగా వినియోగదారుల్లో అయోమయం ఏర్పడినట్టు, స్టాక్ నిర్వహణ పరంగా సవాళ్లు ఎదురవుతున్నట్టు ఏఐసీపీడీఎఫ్ తెలిపింది. ఒకే ధరలో పరిమాణం పరంగా వ్యత్యాసం ఉంటుండడం వినియోగదారుల్లో అయోమయాన్ని కలిగిస్తున్నట్టు ఏఐసీపీడీఎఫ్ ప్రెసిడెంట్ ధైర్యíÙల్ పాటిల్ చెప్పారు. నిల్వ వసతులు పరిమితంగా ఉన్నప్పుడు కంపెనీలు తీసుకొచ్చే ఇన్నేసి రకాల సైజుల ఉత్పత్తులను నిర్వహించడం పెద్ద సవాలుగా పేర్కొన్నారు. దీంతో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను నాలుగు ప్రామాణిక ప్యాక్ సైజులు కింద వర్గీకరించాలని కేంద్ర ప్రజా పంపిణీ శాఖకు ఏఐసీపీడీఎఫ్ సూచించింది. ‘‘ప్రామాణిక ప్యాకేజింగ్ సైజులకు ఉత్పత్తులను క్రమబద్ధీకరించడం వల్ల నిర్వహణ సులభతరం అవుతుంది. రిటైలర్లకు సంక్లిష్టతలు తగ్గుతాయి. వినియోగదారుల్లో అయోమయాన్ని పోగొట్టొచ్చు’’అని పేర్కొంది. ఒకవైపు మార్కెట్ విస్తరణతోపాటు, మ రోవైపు ఉత్పత్తుల పంపిణీ నెట్వర్క్ సాఫీగా నడిచేందుకు వీలుగా ప్యాకింగ్ సైజులు ఉండాలని అభిప్రాయపడింది. కంపెనీలు ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు తాము ప్రోత్సాహం ఇస్తామని, మరింత వ్యవస్థీకృత, వినియోగదారు అనుకూల మార్కెట్ కోసం కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఏఐసీపీడీఎఫ్ అనేది ఎఫ్ఎంసీజీ కంపెనీల డీలర్లు, పంపిణీదారులు, స్టాకిస్ట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. -
సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా లేదు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: నిర్దిష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్‌చార్జీలు ఇతర సుంకాలలో రాష్ట్రాలకు వాటా ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ సెస్సులు, సర్‌చార్జీలు ఇతర సుంకాల పేరిట వసూలు చేసే మొత్తాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే వినియోగిస్తుందని తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు సెస్సుల రూపంలో కేంద్రం వసూలు చేసిన మొత్తాలను పట్టిక రూపంలో మంత్రి వివరించారు. 2014-15లో సెస్సుల కింద కేంద్రం వసూలు చేసిన మొత్తం 82,914 కోట్లు అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సెస్సుల రూపంలో వసూలైన మొత్తం 3 లక్షల 52 వేల 728 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు చెందాల్సిన వాటాపై 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ఫార్ములా వివరాల గురించి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందన్నారు. 2020-21 నుంచి 2025-26 వరకు అమలులో ఉండే 15వ ఆర్థిక సంఘం అవార్డు రాష్ట్రాలకు పన్నుల వాటా పంపిణీ కోసం కొన్ని ప్రాతిపదికలను సూచించింది. రాష్ట్ర జనాభా సంఖ్యకు 15 శాతం, భౌగోళిక విస్తీర్ణానికి 15 శాతం, అటవీ, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వనరులకు 45 శాతం చొప్పున వెయిటేజి ఇచ్చింది. వీటి ప్రాతిపదికపైనే కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను నిర్ణయించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లు’ మంత్రి వివరించారు. ఈ ప్రాతిపదిక ప్రకారం పన్నుల పంపిణీలో బీహార్‌కు 10 శాతం, ఉత్తర ప్రదేశ్‌కు 17 శాతం, మధ్య ప్రదేశ్‌కు 7 శాతం చొప్పున పొందగా ఆంధ్రప్రదేశ్ 4 శాతానికి మాత్రమే పరిమితమైంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి కేంద్ర పన్నుల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 24,460 కోట్లు, 2021-22లో 35,385 కోట్లు 2022-23లో సవరించిన అంచనాల మేరకు 38.176 కోట్లు లభించాయని మంత్రి వెల్లడించారు. అలాగే 2023-24 బడ్జెట్ అంచనాల మేరకు కేంద్ర పన్నులలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 41,338 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. ఏపీలో 16,400 కోట్లతో 5 సోలార్ పార్కులు న్యూఢిల్లీ: సోలార్ పార్కుల అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 4100 మెగావాట్ల సామర్థ్యంతో 5 సోలార్ పార్కులు మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక శక్తి, విద్యుత్ శాఖల మంత్రి ఆర్ కే సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ అనంతపురంలో రెండు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలో ఒక్కో సోలార్ పార్కు, రామగిరిలో సోలార్ విండ్ హైబ్రీడ్ పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభత్వ ఆర్థిక సహాయం కింద 590.80 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్ పార్కు-1కు 244.81 కోట్లు, 500 మెగావాట్ల పార్కు-2కు 91.24 కోట్లు, వైఎస్సార్ కడప జిల్లాలోని 1000 మెగావాట్ల సోలార్ పార్కుకు 54.25 కోట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల పార్కుకు 200.25 కోట్లు చొప్పున ఆర్థిక సహాయాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్ పార్కు-1, కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ పార్కు స్థాపిత సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో 1000 మెగావాట్ల సామర్థ్యానికి గాను 250 మెగావాట్లు, అనంతపురంలోని రెండవ సోలార్ పార్కు 500 మెగావాట్ల సామర్థ్యానికిగాను 400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నట్లు మంత్రి తెలిపారు. రామగిరిలో 200 మెగావాట్ల సామర్థ్యంతో ఆమోదం పొందిన సోలార్ విండ్ హైబ్రిడ్ పార్కును ప్రారంభించాల్సి ఉందని అన్నారు. సోలార్ పార్కులో ఒక మెగావాట్ విద్యుత్ సామర్థ్యం నెలకొల్పేందుకు సరాసరి 4 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ మేరకు మొత్తం 4100 మెగావాట్ల సామర్థ్యంగల 5 పార్కులకు సుమారు 16400 కోట్లు వ్యయం అవుతుందని మంత్రి అన్నారు. డీపీఆర్ తయారు చేసేందుకు ఒక్కో సోలార్ పార్కుకు 25 లక్షలు, అదనంగా ఒక్కో మెగావాట్ స్థాపనకు 20 లక్షలు లేదా 30% నిధులు కేంద్రం చెల్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సోలార్ పార్కులు పూర్తి చేసేందుకు ఈ పథకాన్ని 2024 మార్చి వరకు పొడిగించినట్లు మంత్రిపేర్కొన్నారు. -
ఆర్థిక రంగాన్ని సరిదిద్దుతాం...
న్యూఢిల్లీ: మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఎంఎస్ఎంఈ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ/హెచ్ఎఫ్సీ ఇలా ఎన్నో రంగాలను లక్ష్యంగా చేసుకుని ఇవి ఉన్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను సర్‌చార్జీని భారీగా పెంచుతూ గత బడ్జెట్లో చేసిన ప్రకటన దేశ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా నష్టపరిచింది. దీంతో సర్‌చార్జీ పెంపును తొలగించాలన్న ఎఫ్‌పీఐల డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గింది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను సర్‌చార్జీ అదనపు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. పరిశ్రమలకు చౌకగా మూలధన నిధుల రుణాలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల(హెచ్ఎఫ్సీ)కు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) నుంచి అదనంగా రూ.20,000 కోట్ల నిధుల మద్దతు (మొత్తం రూ.30,000 కోట్లు అవుతుంది), సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు నిధుల కొరత సమస్య తీర్చేందుకు గాను వారికి జీఎస్టీ రిఫండ్లను 30 రోజుల్లోనే చేసేయడం, ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 కోట్ల మూలధన నిధుల సాయం, ఇన్ఫ్రా, హౌసింగ్ ప్రాజెక్టులకు రుణాల లభ్యత పెంచేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు సవరణను 2020 జూన్ వరకు వాయిదా వేయడం, రిజిస్టర్డ్ స్టార్టప్‌లపై ఏంజెల్‌ట్యాక్స్ రద్దు, సహా ఎన్నో నిర్ణయాలు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వాటిల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లపై సర్‌చార్జీ భారం తొలగింపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం మన్నించింది. రూ.2–5 కోట్ల మధ్య ఆదాయంపై సర్‌చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్ల పైన ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జీని 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతున్నట్టు బడ్జెట్ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి అదనంగా ఆర్థిక రంగ పునరుత్తేజానికి ఎటువంటి చర్యల్లేకపోవడంతో... నాటి నుంచి ఎఫ్‌పీఐలు మన మార్కెట్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.25,000 కోట్ల వరకు నిధులను వెనక్కి తీసుకున్నారు. సర్‌చార్జీ పెంపును ఉపసంహరించుకోవాలని వారు గట్టిగా కేంద్రాన్ని డిమాండ్ కూడా చేశారు. ‘‘క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఫైనాన్స్ యాక్ట్ 2019 ద్వారా స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై విధించిన సర్‌చార్జీ పెంపును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది’’ అని మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల మేర ఆశించిన ఆదాయం రాకుండా పోతుంది. సర్‌చార్జీ ఉపసంహరణ దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అందరికీ వర్తిస్తుంది. స్టార్టప్‌లకు ఊరట రిజిస్టర్డ్ స్టార్టప్‌లకు ఏంజెల్ ట్యాక్స్ నుంచి ఉపశమనం కల్పించడం ప్రభు త్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. ‘‘స్టార్టప్‌లు, వాటిల్లో ఇన్వెస్ట్ చేసే వారు ఎదుర్కొంటున్న నిజమైన ఇబ్బందులను తొలగించేందుకు గాను, డీపీఐఐటీ వద్ద నమోదైన స్టార్టప్‌లకు ఆదాయపన్ను చట్టంలోని 56(2)(7బీ)ను అమలు చేయరాదని నిర్ణయించడం జరిగింది’’ అని మంత్రి వెల్లడించారు. ఆదాయపన్ను సర్‌చార్జీ పెంపు, ఏంజెల్ ట్యాక్స్ రద్దును నిపుణులు స్వాగతించారు. క్యాపిటల్ మార్కెట్లకు ఇవి జోష్‌నిస్తాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రాజేష్ గాంధీ అభిప్రాయపడ్డారు. రుణాలు ఇక చౌక! గృహ, వాహన, వినియోగ రుణాలు చౌకగా మా రనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్బీఐ రేట్ల కోతను బ్యాంకులు ఎంసీఎల్ఆర్ విధానంలో రుణ గ్రహీతలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. రెపో రేటు, ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమైన రుణ ఉత్పత్తులను బ్యాంకులు ప్రారంభిస్తాయని, ఫలితంగా గృహ, వాహన, ఇతర రిటైల్ రుణాల ఈఎంఐలు తగ్గుతాయని పేర్కొన్నారు. అలాగే, వ్యవస్థలో రుణ వితరణను పెంచేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వం రూ.70,000 కోట్లను మూలధన సాయంగా అందించనున్నట్టు చెప్పారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలో రూ.5 లక్షల కోట్ల వరకు అదనపు లిక్విడిటీ, రుణ వితరణ సాధ్యపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇక రుణాల వితరణ ప్రక్రియను మరింత సులభంగా మార్చేందుకు పీఎంఎల్ఏ, ఆధార్ నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేయనుంది. రుణాలను తీర్చేసిన 15 రోజుల్లోపు వాటి డాక్యుమెంట్లను రుణ గ్రహీతలకు ప్రభుత్వరంగ బ్యాంకులు తిరిగి ఇచ్చేయడం ఇకపై తప్పనిసరి. దీనివల్ల కస్టమర్లు బ్యాంకుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పిపోతాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల మద్దతు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్ఎఫ్సీలు) అదనంగా రూ.20,000 కోట్ల నిధులను ఎన్‌హెచ్‌బీ ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎఫ్సీలకు లోగడ ఎన్‌హెచ్‌బీ ప్రకటించిన రూ.10,000 కోట్లకు ఇది అదనపు సాయం. దీనివల్ల హౌసింగ్ రంగానికి నిధుల వితరణ పెరగనుంది. ఆధార్ ఆధారిత కేవైసీని వినియోగించేందుకు ఎన్బీఎఫ్సీలను అనుమతించనున్నట్టు మంత్రి తెలిపారు. ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఆస్తులను బ్యాంకులు కొనుగోలు చేసేందుకు పాక్షిక క్రెడిట్ స్కీమ్‌ను ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించగా, ప్రతీ బ్యాంకు స్థాయిలో దీనిపై అత్యున్నత స్థాయిలో సమీక్ష చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మన దగ్గరే వృద్ధి వేగం... అంతర్జాతీయంగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థతో పోల్చి చూసినా భారత జీడీపీయే వేగంగా వృద్ధి చెందుతోందని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జీడీపీ వృద్ధి అంచనాలను 3.2 శాతానికి సవరించే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ సగటు కంటే భారత ఆర్థిక రంగం వృద్ధి వేగంగా ఉందన్నారు. ఆటో రంగానికి ఉద్దీపనలు దేశంలో వాహన విక్రయాలు 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన తరుణంలో ఈ రంగానికి ఉద్దీపనం కల్పించే నిర్ణయాలను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజును వాయిదా వేసింది. ప్రభుత్వ విభాగాలు పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, అన్ని రకాల వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌ను మాత్రం పట్టించుకున్నట్టు లేదు. 2020 ఏప్రిల్ నుంచి బీఎస్–6 వాహనాలనే కంపెనీలు విక్రయించాల్సి ఉంటుంది. అయితే, ప్రతికూల పరిస్థితుల కారణంగా బీఎస్–4 వాహనాల నిల్వలు పెరిగిపోతుండడం, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై ఆసక్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో... 2020 మార్చి 31 వరకు కొనుగోలు చేసే వాహనాలను వాటి రిజిస్ట్రేషన్ గడువు వరకు రోడ్లపై తిరిగేందుకు అనుమతించనున్నట్టు మంత్రి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటర్నల్ కంబస్టన్ వాహనాలకూ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆటో రంగంలో ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలకు గండి పడినట్టు నివేదికలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. మార్చి వరకు కొనుగోలు చేసే వాహనాలపై తరుగుదలను 15 శాతానికి బదులు 30 శాతానికి పెంచుతున్నట్టు మంత్రి చెప్పారు. వాహనాలను తుక్కుగా మార్చడం సహా పలు చర్యలను పరిశీలించనున్నట్టు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు వేగంగా రిఫండ్లు ఎంఎస్ఎంఈలకు జీఎస్టీ రిఫండ్లను ప్రభుత్వం ఇకపై 30 రోజుల్లోపు చెల్లించనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ సంబంధిత బకాయిలు అన్ని వేళలా సగటున రూ.7,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. జీఎస్టీ బకాయిలను 30రోజుల్లోపు పూర్తి చేయడం అన్నది ఎంఎస్ఎంఈ రంగానికి ఎంతో మేలు చేస్తుందని, అంతిమంగా ఉపాధి అవకాశాల పెంపునకు దారితీస్తుందని ఎంఎస్ఎంఈ శాఖా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఎంఎస్ఎంఈలకు ఒకటే నిర్వచనం ఇచ్చే దిశగా చట్ట సవరణను పరిశీలించనున్నట్టు చెప్పారు. మరిన్ని ముఖ్యాంశాలు... ► రూ.100 లక్షల కోట్లను మౌలిక సదుపాయాల రంగంపై వెచ్చించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా... ఇన్ఫ్రా ప్రాజెక్టులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ టాస్క్ ఫోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ► అలాగే, మౌలికరంగ, హౌసింగ్ ప్రాజెక్టులకు రుణాల వితరణ పెంచేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయనుంది. ► కార్పొరేట్ సామాజిక బాధ్యత నిబంధనలను ఉల్లంఘించడాన్ని నేరపూరిత చర్యగా పరిగణించబోమని, సివిల్ లయబులిటీగానే చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. సంపద సృష్టికర్తలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. ► ఆదాయపన్ను శాఖ నుంచి ఆదేశాలు, నోటీసుల జారీకి కేంద్రీకృత వ్యవస్థ. ► స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా సీబీడీటీలో సెల్ ఏర్పాటు. భారతీయ కంపెనీలను కాపాడాలి కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంపిటిషన్ కమీషన్ సన్నద్ధం కావాలని మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. మారిన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో విదేశీ సంస్థల నుంచి పోటీ పరంగా భారత కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్ శాఖ వ్యవహరాలనూ కూడా మంత్రి నిర్మలా సీతారామనే చూస్తున్నారు. సీసీఐ పదో వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ... పోటీ పరంగా దేశీయ మార్కెట్‌పై అంతర్జాతీయ సంస్థల ప్రభావాన్ని తెలుసుకునేందుకు సీసీఐ స్వచ్చందంగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. భారతీయ వినియోగదారులను, భారత కంపెనీలను పరిరక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. ఊతమిస్తాయి... ప్రభుత్వం ప్రకటించిన పలు చర్యలు విశ్వాసాన్ని పెంచి, ఆర్థిక రంగంలో సహజ స్ఫూర్తి ఫరిడవిల్లేలా చేస్తాయని దేశీయ పరిశ్రమలు అభిప్రాయపడ్డాయి. ఆటో రంగం టర్న్ అరౌండ్ అయ్యేందుకు తోడ్పడుతుందని పరిశ్రమ పేర్కొంది. ఎఫ్‌పీఐలు, దేశీయ ఇన్వెస్టర్ల లాభాలపై సర్‌చార్జీని తొలగించడం కీలకమైన ప్రకటన. ఇది తిరిగి ఉత్సాహాన్ని పాదుకొల్పుతుంది. – ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూపు చైర్మన్ అద్బుతమైన ప్యాకేజీ. ఆర్థిక రంగాన్ని తదుపరి దశకు తీసుకెళుతుంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ మందగమనం సంకేతాలను ఇస్తున్న ఆర్థిక రంగ పునరుత్తేజానికి ప్రభుత్వ చర్యలు ఎంతో మేలు చేస్తాయి. వ్యాపారాలు, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఈ చర్యలు తప్పకుండా నిలబెడతాయి. – సందీప్ సోమానీ, ఫిక్కీ ప్రెసిడెంట్. ప్రభుత్వ ప్యాకేజీ మొత్తం మీద ఆర్థిక రంగానికి భారీగా మేలు చేస్తుంది. ఎందుకం టే ఇది వాస్తవంగా నిర్వహణ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. రాష్ట్రాలు సైతం తమవంతుగా రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించేందుకు ముందుకు రావాలి. – భార్గవ, మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ ప్రభుత్వ చర్యలు ఆటో పరిశ్రమకు తక్షణ ఉపశమనాన్నిస్తాయి. – వేణు శ్రీనివాసన్, టీవీఎస్ మోటార్ చైర్మన్ ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ఆటో రంగానికి తోడ్పాటునివ్వడంతోపాటు స్పష్టమైన రోడ్ మ్యాప్‌నకు వీలు కల్పిస్తాయి. ఈ నిర్ణయాలు అమలైతే వృద్ధికి, ఆటో రంగంలో డిమాండ్‌కు దారితీస్తాయి. – మార్టిన్ ష్యూవెంక్, మెర్సెడెస్ బెంజ్ ఇండియా సీఈవో మార్కెట్లకు ఉద్దీపనల ప్యాకేజీ మేలు చేస్తుంది. ఎఫ్‌ఫీఐలపై సర్‌చార్జీని తొలగించడం తిరిగి విదేశీ నిధులు మన మార్కెట్ల వైపు వచ్చేలా చేస్తుంది. పండుగల సీజన్‌కు ముందు ఈ ఉద్దీపనల ప్యాకేజీ ఆర్థిక రంగానికి మేలు చేస్తుంది. – గౌతం ష్రాఫ్, ఎడెల్వీజ్ సెక్యూరిటీస్ కోహెడ్ -
మే 10 వరకూ గరీబ్ యోజన డిక్లరేషన్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద డిక్లరేషన్లను మే 10 వరకూ దాఖలు చేసుకునే అవకాశాలన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ కల్పించింది. ‘‘పన్ను, సర్‌చార్జ్, జరిమానాలను మే 31వ తేదీ, ఏప్రిల్ 30లోపు డిపాజిట్ చేసిన వారు ఇందుకు సంబంధించి తమ డిక్లరేషన్లను సమర్పించుకోడానికి మే 10 వరకూ అవకాశాన్ని కల్పించడం జరిగింది’’ అని ఒక ఉన్నతాధికారి తెలిపారు. డిపాజిట్ గడువును తాజాగా ఏప్రిల్ 30వ తేదీ వరకూ నెలరోజులపాటు ఇటీవలే పొడిగించిన సంగతి తెలిసిందే. -
ప్రయాణికులపై సర్'చార్జ్'
బెల్లంపల్లి :‘చెప్పుకోను పోతే పట్టుకొని కొట్టినట్లు’గా తయారైంది రైలు ప్రయాణికుల పరిస్థితి. ఎక్స్‌ప్రెస్ రైలుకు బదులు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని అడిగిన పాపానికి ప్రయాణికులపై రైల్వే శాఖ పెను భారం మోపింది. కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలును సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చి సర్‌చార్జి వసూళ్లకు పాల్పడుతోంది. గమ్య స్థానానికి కేవలం ఐదు నిమిషాలు ముందుగా వెళ్తోందనే కారణంతో ఒక్కో ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ.15 రైలు ప్రయాణికులపై సర్‘చార్జ్’ చొప్పున సర్‌చార్జి వసూలు చేస్తోంది. ప్రయాణికుల కష్టనష్టాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా, కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా సర్‌చార్జి భారం మోపి జేబులు గుల్ల చేస్తోంది. సర్‌చార్జి వసూలుతో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం వద్దురా బాబోయ్ అని ప్రయాణికులు గగ్గోలు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్వే శాఖ అనుసరిస్తున్న తీరుపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్ రైలుగా మార్చి.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్–రాష్ట్ర రాజధాని సికింద్రాబాద్ మధ్య కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ పేరుతో రైలును ప్రవేశపెట్టారు. ఈ రైలు కుమ్రం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జనగామ, యాదాద్రి జిల్లాల మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణంలో ఈ రైలు 12 స్టేషన్లలో ఆగుతుంది. రోజువారీగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నా ఈ రైలుకు ముఖ్యమైన, సాధారణ రైల్వే స్టేషన్లలోనూ హాల్టింగ్ ఇస్తున్నారు. సత్వరంగా గమ్యస్థానం చేరుకోలేక రైలులోనే గంటలకొద్ది ప్రయాణం సాగిస్తున్నారు. పేరు మారిందే కాని... కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలును సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారే తప్ప మరెలాంటి మార్పులు జరగలేదు. వేగంలో కొద్దిపాటిగా తేడా ఉన్నా, రైల్వే స్టేషన్ల హాల్టింగ్లో మాత్రం మార్పులు చోటు చేసుకోలేదు. పాత పద్ధతిలోనే ప్రతి రైల్వేస్టేçÙన్‌లోనూ కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగుతోంది. కాకపోతే గతంలో కన్న ఐదు నిమిషాల ముందు గమ్యస్థానం చేరుకుంటోంది. ఎక్స్‌ప్రెస్ రైలు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా రూపాంతరం చెందిన ప్రయాణికులకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. పైపెచ్చు సర్‌చార్జి వసూలుతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ చార్జి వసూలు చేస్తున్నారు. రూ.కోట్ల భారం సర్‌చార్జి పేరుతో రైల్వే శాఖ ప్రయాణికుల నుంచి రూ.కోట్లలో ఆదాయం సమకూర్చుకుంటోంది. తద్వారా ప్రయాణికులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కి ముందు వచ్చే రైల్వే స్టేషన్లో దిగిన కూడా సర్‌చార్జి రూ.15 చెల్లించుకోక తప్పదు. తూర్పు ప్రాంతంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలలోని పలు ప్రాంతాల నుంచి రోజువారీగా వేల సంఖ్యలో ప్రయాణికులు కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో రాకపోకలు చేస్తున్నారు. రోజువారీగా కనిష్టంగా 3 వేల నుంచి గరిష్టంగా 4 వేల మంది వరకు ప్రయాణిస్తుంటారు. ఆ తీరుగా ఒక్కో టికెట్‌పై రూ.15 చొప్పున సర్‌చార్జి రోజుకు రూ.45 వేలు వసూలు అవుతుండగా, నెలకు రూ.13.50 లక్షలు, ఆ ప్రాతిపదికన ఏడాదికి సుమారు రూ.1.62 కోట్లు రైల్వే ఖజానాకు సమకూరుతోంది. మాది బెల్లంపల్లి. కిరాణ వ్యాపారం చేస్తున్నాను. ప్రతి నెలలో హైదరాబాద్‌కు రెండు, మూడుసార్లు ప్రయాణం సాగిస్తాను. కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగుతుండటంతో ఇన్నాళ్లు ఇబ్బందు లు పడ్డాం. అదే రైలును ఇప్పుడు సూపర్‌ఫాస్ట్‌గా మార్చారు. కానీ.. ఎక్స్‌ప్రెస్ రైలు మాదిరిగానే అన్ని స్టేషన్లలోనూ ఆగుతోంది. సర్‌చార్జి మాత్రం రూ.15 అదనంగా వసూలు చేస్తుండడం గమనార్హం. రైల్వేస్టేషన్ల హాల్టింగ్లో మార్పులు చేయకుండా, వేగం పెంచకుండా సర్‌చార్జి వసూలు చేయడం సరికాదు. - బ్రిజ్గోపాల్ లోయ -
భలే చాన్సులే దోపిడీకి..
సర్‌చార్జితో రైల్వే.. 50 శాతం పెంపుతో ఆర్టీసీ.. అదే దారిలో భారం వేయనున్న ప్రైవేట్ వాహనాలు 12 గంటలకే రోజు అద్దె వసూలు చేయనున్న లాడ్జిలు నియంత్రించేందుకు కానరాని ప్రయత్నాలు రాజమండ్రి :గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులపై ఆర్థికభారం మోపి, సొమ్ము చేసుకునేందుకు అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు సంస్థలు సిద్ధమవుతున్నారుు. పుష్కరాలను సొమ్ము చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ప్రజారవాణా సంస్థలైన రైల్వే, ఆర్టీసీ దొడ్డిదారిన ప్రయాణికులను దోచుకునేందుకు చూస్తుంటే.. ఇక ప్రైవేటు రవాణా సంస్థలు, లాడ్జిలు, హోటళ్లు భక్తుల నుంచి అదనపు చార్జీలు గుంజనున్నారుు. పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు. ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం పుష్కరాలకు 4 కోట్ల మందికి పెబడి వస్తారని అంచనా. ఇందుకు తగ్గట్టుగా రైళ్లు, ఆర్టీసీ బస్సులను వేయడంలో ప్రభుత్వం పెద్దగా చొరవ చూపడంలేదు. పైగా పుష్కరాలకు వేసే ప్రత్యేక రైళ్లపై టికెట్టుకు సర్‌చార్జి పేరుతో రైల్వే శాఖ దోపిడీకి సిద్ధమైంది. చైర్ కార్, జనరల్ టికెట్, స్లీపర్లపై రూ.5 చొప్పున, థర్డ్ ఏసీపై రూ.10చొప్పున, సెకండ్ ఏసీకి రూ.15 చొప్పున, ఏసీ ఫస్ట్ క్లాస్‌కు రూ.20 చొప్పున సర్‌చార్జి వసూలు చేయనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్టీసీ పుష్కరాలకు ప్రయూణికుల నుంచి భారీ దోపిడీకి తెరతీస్తోంది. కాలం చెల్లిన బస్సులు, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలలోని సిటీ బస్సులనే పుష్కరాలకు ప్రత్యేక బస్సులుగా వేస్తున్నారు. ఈ సర్వీసులలో చార్జీలు 50 శాతం పెంచనున్నారు. ట్రైన్లు, బస్సులు అవసరమైన స్థాయిలో వేయకపోవడాన్ని అవకాశంగా తీసుకుంటున్న ప్రైవేటు వాహనదారులు కూడా అందినకాడికి దోచుకునే పనిలో ఉన్నారు. పుష్కర వేళల్లో కాల్ టాక్సీలు, టాటా ఏసీలు, మ్యాజిక్, జీపులు తదితర ప్రైవేటు వాహనాలకు కూడా రెండు మూడు రెట్లు చార్జీలు వసూలు చేయనున్నారు. వీటి నియంత్రణకు రవాణా శాఖ ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదు. బస భారమే.. రాజమండ్రిలో పుష్కరాలకు బస చేసే ప్రయాణికులపై చార్జీల పిడుగులు పడనున్నాయి. ఇప్పటికే నగరంలో చాలావరకు హోటళ్లు ముందుగానే బుక్ అయిపోయాయి. సాధారణంగా లాడ్జిలో గదులు 24 గంటల ప్రాతిపదికన ఇస్తారు. పుష్కరాల నేపథ్యంలో కొన్ని లాడ్జిలు చార్జీలు పెంచడం లేదంటూనే అదే ధరకు 12 గంటలకు మాత్రమే గదులు ఇవ్వడానికి ప్రణాళిక వేస్తున్నారు. అంటే ఒక రోజు బస చేసే భక్తులు రెండు రోజులకయ్యే ఖర్చు పెట్టాల్సిందే. కొన్ని లాడ్జిలలో గదులు సాధారణ రోజుల్లో రూ.1200 నుంచి రూ.1500 వరకు ఉంటే పుష్కర రోజుల్లో రూ.3 వేల నుంచి రూ.4 వేలన్నా గదులు దొరకని పరిస్థితి. కొన్ని లాడ్జిలు గదులు బ్లాక్ చేసి పెట్టుకుంటున్నాయి. మరోపక్క పుష్కర రోజుల్లో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చాయ్ దుకాణాల్లో రేట్లు పెంచేయనున్నారు. -
యూనివర్సల్ నంబరింగ్ అవశ్యం
హైదరాబాద్ (సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ట్యాక్సీ క్యాబుల్లో, హైవేల్లో ప్రయాణించే వారు ఆపదల్లో ఉన్నప్పుడో, అత్యవసర సమయాల్లో పోలీస్ యంత్రాంగానికి తక్షణమే సమాచారాన్ని చేరేవేసేందుకు ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ ఎమర్జన్సీ కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే ఢిల్లీ తరహా సంఘటనలు పునరావృతం కాబోవని నిపుణులు పేర్కొంటున్నారు. వివిధ ఎమర్జన్సీ సేవలకు వివిధ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటికి బదులుగా తేలికగా గుర్తుంచుకునే ఒకటే నెంబర్‌ను ప్రవేశపెట్టడమే యూనివర్సల్ ఎమర్జన్సీ నెంబరింగ్ విధానం. టెలికాం రెగ్యులేరటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పరిశీలనలో ఉన్న ఈ వ్యవస్థను తక్షణమే అమల్లో పెట్టాల్సిన అవసరం వుందని నిపుణులు చెపుతున్నారు. టెలికాం వినియోగదారుల నుంచి సర్‌ఛార్జి రూపంలో ప్రభుత్వం సమీకరించిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఎఫ్ఓ)లో రూ. 16వేల కోట్ల నిధి మగ్గుతోందని, అందులో కొంత సొమ్ము ప్రభుత్వం ఖర్చు చేస్తే టెలికాం ఆపరేటర్లపై భారం కూడా ఉండదంటున్నారు. యూనివర్సల్ సింగిల్ నంబర్ ఆధారంగా పనిచేసే ఇంటిగ్రేటెడ్ ఎమర్జన్సీ కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ ప్రధానంగా రెండు రకాల నంబరింగ్ సేవలను అందించగలదు. ఒకటి కాల్ చేసిన వ్యక్తి చిరునామా, వయసు లాంటి వివరాలు, రెండు కాల్ ఏ భౌగోళిక ప్రాంతం నుండి వస్తోందన్న సమాచారం పోలీసు యంత్రాంగానికి వెనువెంటనే చేరిపోతుంది. ఇటీవల ఢిల్లీలో ఒక క్యాబ్‌లో జరిగిన అత్యచార సంఘటన సందర్భంగా బాధితురాలు పలు టెక్ట్స్ మెసేజీలు పంపిన రెండు గంటల తర్వాత మాత్రమే పోలీసు యాంత్రాగానికి కాల్ చేయగలిగింది. ఆ కాల్ ఎక్కడ్నుంచి వచ్చిందో పోలీసులు వెనువెంటనే గుర్తించలేకపోయారు. అటుతర్వాత డ్రైవర్‌ను అరెస్టు చేయడానికి చాలా సమయమే పట్టింది. ప్రతిపాదిత కాలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఆపదలో వున్నవారికి తక్షణం సహాయం లభించే అవకాశం వుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియా, జీపీఎస్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉండటంతో టెలీకామ్ ఆపరేటర్ల సాయం లేకుండానే అత్యవసర సమాచారాన్ని చేరవేసే అవకాశం ఉంది. బీసేఫ్, ఫ్యామిలీ జీపీఎస్ ట్రాకర్, ఐ వాచ్ లాంటి యాప్స్ అత్యవసర సమాచారాన్ని బంధువులు, స్నేహితులకు చేరవేసే అవకాశం కల్పిస్తున్నాయి. ట్రూకాలర్ యాప్ ఫోన్ చేసిన వ్యక్తి వివరాలను ఖచ్చితంగా ఇవ్వగలుగుతోంది. అయితే ఆ యాప్స్ వినియోగించాలంటే స్మార్ట్‌ఫోన్ తప్పని సరి. దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 15 శాతం మించి లేరు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గతేడాది ఇంటిగ్రేటెడ్ ఎమర్జన్సీ కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ వినియోగంపై ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసింది. అయితే ఇది తమ ఆదాయంపై ప్రభావం చూపుతుందని టెలికాం ఆపరేటర్లు ట్రాయ్ చర్యను తీవ్రంగా అడ్డుకోవడంతో ఇది అటకెక్కింది. ప్రస్తుతం 2002లో ప్రవేశపెట్టిన కమ్యూనికేషన్స్ కన్వర్జెన్స్ బిల్లుకు కొత్త ఊపిరులు పోయాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో యూనివర్సల్ ఎమర్జన్సీ నంబరింగ్ సేవలను తప్పక ప్రారంభించేలా ప్రభుత్వం ఒక విధాన ప్రకటన చేయాల్సిన సమయం ఇదే అని నిపుణులు పేర్కొంటున్నారు. వివిధ ఎమర్జన్సీ సేవలకు వివిధ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటికి బదులుగా తేలికగా గుర్తుంచుకునే ఒకటే నెంబర్‌ను ప్రవేశపెట్టడమే ఈ యూనివర్సల్ ఎమర్జన్సీ నెంబరింగ్ విధానం. -
2013లో బెంబేలెత్తించిన ధరలు
కూర‘గాయాలు’ కూరగాయాల ధరలు చుక్కల్ని అంటడంతో ఈ ఏడాది వినియోగదారులు సర్దుకుపోవాల్సి వచ్చింది. కిలో కూరగాయలు కొనే బదులు పావుకిలోతో సరిపెట్టుకున్నారు. ఒక దశలో కూరగాయలకంటే మాంసం తినడమే సులువు అనిపించింది. సంవత్సరం మొదట్లో కిలోకు రూ.15 ఉన్న టమాట సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రూ.70, వంకా య రూ.15 నుంచి రూ. 40, బెండ రూ.20 నుంచి 40, మిర్చి రూ.20 నుంచి 80, బీర రూ.25 నుంచి రూ. 40, క్యాబేజీ రూ.20 నుంచి రూ.35, క్యారెట్ రూ.24 నుంచి రూ. 60కి ఎగబాకింది. అయితే ఏడాది చివర డిసెంబర్లో కొంత తగ్గుముఖం పట్టాయి. కన్నీరు పెట్టించిన ఉల్లి ఉల్లి జనాన్ని కంటతడి పెట్టించింది. అకాల వర్షాలు, తుపానుల ప్రభావంతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో మహారాష్ట్ర దిగుమతుల పనే ఎక్కువగా ఆధారపడడంతో ఒక్కసారిగా ఉల్లి రేటు పెరిగిపోయింది. మరోవపు ఉద్యమ సెగలతో రవాణా వ్యవస్థకు కూడా ఆటంకం ఏర్పడుతుండడంతో వ్యాపారులు కూడా తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు రూ. 30 నుంచి ఒక దశలో రూ.70 వరకు పెరగడం గమనార్హం. ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది .పెట్రోల్, డీజిల్ దడ జనవరిలో లీటరు డీజిల్ ధర రూ.50.23 ఉండగా ప్రస్తుతం రూ. 57.97 చేరుకుంది. రూ.7.74 అదనంగా పెరగడంతో ట్రాన్స్పోర్ట్ రంగంపై పెనుభారం పడింది. నిత్యావసర సరుకుల రవాణా చార్జీలు పెరిగిపోవడంతో పరోక్షంగా సామాన్యుడిపై భారం పడింది. జిల్లాలో రోజుకు 2.20లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుంది. ఈ లెక్కన రోజుకు రూ.18లక్షల అదనపు భారం పడింది. జిల్లావ్యాప్తంగా సుమారు 120 వరకు పెట్రోలియం ఔట్‌లెట్లున్నాయి. జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.72 ఉండగా.. ప్రస్తుతం రూ.78.20కి చేరుకుంది. అంటే లీటరుకు ఏకంగా రూ.6 పెరిగింది. జిల్లాలో రోజుకు 1లక్ష 20 వేల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతోంది. పెరిగిన ధరతో రోజుకు రూ.7లక్షల 20వేల అదనపు భారం ప్రజలు మోయాల్సి వచ్చింది. బస్సు భారం డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ కూడా బస్ చార్జీలను పెంచేసింది. రెండుసార్లు ఆర్టీసీ అధికారులు చార్జీలను పెంచారు. విద్యార్థుల బస్సు పాస్‌ల చార్జీలు కూడా పెంచడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. 2012 సెప్టెంబర్ 24న సాధారణ చార్జీలను 9.5 శాతం పెంచారు. జిల్లా ప్రజలపై రోజుకు రూ.5 లక్షల చొప్పున అదనపు భారం మోయాల్సి వచ్చింది. తద్వారా ఏడాదికి కోట్ల భారం ప్రజలపై పడింది. సర్‌చార్జీల పిడుగు సర్‌చార్జీల పేరుతో సర్కారు విద్యుత్ వినియోగదారులపై పెను భారమే మోపింది. బడ్డీ కొట్టు నుంచి మొదలుకుంటే పరిశ్రమల వరకు అన్ని కేటగిరీల వినియోగదారులపై విద్యుత్ భారం పడింది. స్లాబులు విభజించి సాధారణంగా 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే వారిని కూడా ప్రభుత్వం విడిచిపెట్టకుండా చార్జీలను పెంచేసింది. 2013 సంవత్సరంలో జిల్లా ప్రజలపై అదనంగా సుమారు రూ.200 కోట్ల భారం పడింది. కోతల కారణంగా పరిశ్రమల యజమానులు ఇక్కట్లు పడ్డారు. పీక్ సమయాల్లో ఎవరైనా విద్యుత్ వినియోగానికి పూనుకుంటే వారికి 3 రేట్ల అపరాధ రుసుం విధించారు. గత వేసవిలో చిన్న చిన్న పరిశ్రమలు దాదాపుగా మూతబడ్డాయి. గ్యాస్ మంటలు ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆధార్ తప్పనిసరి చేయడంతో సబ్సిడీ సిలిండర్‌కు మొదట వినియోగదారుడు పూర్తిస్థాయిలో ధర చెల్లించాల్సి వచ్చింది. గ్యాస్ సిలిండర్లకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. వినియోగదారుడు సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ బ్యాంకులో జమ అవుతోంది. ప్రస్తుతం రూ.1,107లకు సబ్సిడీ సిలిండర్ ధర పెరిగింది. రూ.633 సబ్సిడీ బ్యాంకులో జమ అవుతోంది. కాగా ఆధార్ సీడింగ్ కాని వినియోగదారులకు రూ.419కి సిలిండర్ లభిస్తుంది. ఆధార్ సీడింగ్, సీడింగ్ కాని వినియోగదారులకు మధ్య రూ.60కి పైగా వ్యత్యాసం రావడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 3 లక్షలకు పైగా సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా సబ్సిడీ సిలిండర్లను 9కి మాత్రమే పరిమితం చేయడంతో ఆ తర్వాత తీసుకునే సిలిండర్లపై వినియోగదారుడికి పెను భారం పడుతోంది. అదనంగా తీసుకునే సిలిండర్లకు సుమారు రూ.700 వ్యత్యాసం ఉండటం గమనార్హం. బియ్యం, నూనెలతో కంగారు పేదలకు అందుబాటులో ఉండే పామాయిల్ కూడా కంగారు పెట్టించింది. ప్రస్తుతం కిలో రూ.65కు లభ్యం అవుతున్నా.. నిన్న మొన్నటి దాకా రూ.88 పలకడంతో సామాన్యులు విలవిల్లాడిపోయారు. ఇక వేరుశెనగ నూనె అయితే ఏకంగా రూ.110 వరకు చేరింది. బియ్యం ధర గుబులు పెట్టిస్తోంది. ఈ ఏడాది మొదట్లో రూ.3,800 నుంచి క్రమంగా క్వింటాలు బియ్యం ధర రూ.5 వేలకు చేరాయి. పాల ధర కూడా... ఈ ఏడాది లీటరు పాల ధర రెండు రూపాయల చొప్పున పెంచారు. సరాసరిన రోజుకు వేల లీటర్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ విధంగా లక్షల రూపాయల భారం ప్రజలపై పడింది. -
భారంగా బతుకుబండి
ఈ ఏడాది అన్ని వర్గాల ప్రజల బతుకు బండి భారంగా సాగింది. చీటికి మాటికి విద్యుత్ చార్జీల పెంపు, పూటకో తీరుగా సర్దుబాటు, సర్‌చార్జీల మోతతో విద్యు త్‌శాఖ అధికారులు హడలెత్తించారు. దీని కితోడు బస్సు చార్జీల పెంపు, విద్యార్థుల బస్ పాస్ చార్జీల పెంపుతో బస్సు ప్ర యా ణం కూడా భారమైంది. మరో పక్క బి య్యం, ఉప్పులు, పప్పులు, కూరగాయల వంటి నిత్యావసరాల ధరలు చుక్కలను తా కాయి. మొత్తం మీద ఈ ఏడాది ప్రభుత్వ వడ్డింపులు, ధరల పెంపుతో జిల్లా ప్రజలపై వందల కోట్లకుపైగా అదనపు భారం పడినట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2013 సంవత్సరం బడుగు జీవులకు తీపి కంటే చేదునే ఎక్కువగా మిగిల్చింది. నిత్యం పెట్రో పేలుళ్లు పెట్రో ధరలపై కేంద్రం నియంత్రణ ఎత్తివేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా పెట్రో, డీజిల్ ధరలు పలు మార్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. జిల్లాలో ఏప్రిల్ నెలలో రూ.73 ఉన్న లీటర్ పెట్రోల్ సెప్టెంబర్‌లో రూ.82.72కు పెరిగి గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం రూ.77.22కు తగ్గింది. ప్రస్తుత డీజిల్ ధర రూ.58.73కు చేరుకుని గరిష్ట స్థాయికి ఎగబాకింది. ప్రతి నెలా సగటున 12,000 కిలో లీటర్ల డీజిల్, 4,500 కిలో లీటర్ల పెట్రోల్ అమ్మకాలు జరుగుతున్నాయి. పెట్రోల్‌పై రూ.20 కోట్లు, డీజిల్‌పై రూ.3.5 కోట్ల వరకు జిల్లా ప్రజలు అదనపు భారాన్ని మోసినట్లు అంచనా. ఆర్టీసీ ‘సెస్సు’బుస్సు.. సెస్సు పేరిట ఆర్టీసీ ప్రయాణికులపై భారం మోపింది. గత జూలై 4 నుంచి ప్రతి టికెట్‌పై అదనంగా రూపాయి సెస్సు వసూలు చేస్తోంది. పల్లెవెలుగు మినహాయించి ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారిని బాదేసింది. దీంతో మెదక్ రీజియన్ పరిధిలో ప్రయాణికులపై నెలకు రూ.కోటి చొప్పున ఈ ఆరు నెలల్లో రూ.6 కోట్లకు పైగా అదనపు భారం పడింది. రోజూ కూర‘గాయాలు’ నిత్యావసర సరుకుల ధరలు రాకెట్ వేగంతో ఆకాశంలోకి దూసుకెళ్లాయి. ప్రధానంగా కూరగాయల అంగడికి వెళ్లిన ప్రతిసారీ సామాన్యుడి జేబులకు చిల్లులు పడ్డాయి. ఒక్కో కూరగాయ కిలో ధర రూ.50 నుంచి రూ.90 వరకు పలికింది. ఒకానొక దశలో కిలో టమాటా రూ.80, ఉల్లీ రూ.90, అల్లం రూ.150, వెల్లుల్లి రూ.200, మిరప రూ.60కి చేరడంతో సామాన్యుడి కంట్లో నీళ్లు తిరిగాయి. ఇప్పటికీ కిలో కూరగాయల ధరలు రూ.50 చుట్టూ తిరుగుతున్నాయి. కరెంట్‘చార్జీ’ రూ.96 కోట్లు..సరు‘్దపోటు’ రూ.45.95 కోట్లు.. విద్యుత్ చార్జీల పెంపునకు ఇంధన సర్దుబాటు చార్జీల వడ్డన తోడవడంతో బిల్లులు చూసి వినియోగదారులు ఘోల్లుమన్నారు. జిల్లాలో 8.79 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. ప్రతి నెలా 60 నుంచి 75 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. పెరిగిన చార్జీల వల్ల జిల్లా ప్రజలపై ప్రతి నెలా రూ.8 కోట్ల చొప్పున ఏడాదికి రూ.96 కోట్ల అదనపు భారం పడింది. ఇక ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో మరో రూ.45.95 కోట్ల భారం పడింది. గృహ వినియోగదారులతోపాటు పరిశ్రమల యజమానులు ప్రతి నెలా షాక్‌కు గురయ్యారు.