డీజిల్ ధరల్ని తగ్గించండి: సీపీఎం
న్యూఢిల్లీ: డీజిల్ ధరల్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించకపోవడంపై సీపీఎం మండిపడింది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పతనమైనప్పటికి పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించకుండా కేంద్ర కాలయాపన చేస్తోందని సీఎం విమర్శించింది.
క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 92 డాలర్ల దిగువకు వచ్చిందని, ప్రతి లీటరుకు 1.90 పైసల లాభాన్ని చమురు కంపెనీలు ఆర్జిస్తున్నాయని సీపీఎం వెల్లడించింది. ఇదిలా ఉండగా లీటర్ డీజిల్ ధర మరో యాభై పైసలు పెంచాలని చమురు కంపెనీలు ప్రభుత్వానికి లేఖరాయడంపై సీపీఎం తప్పుపట్టింది. 2013 జనవరి నుంచి డీజిల్ ధర తగ్గించలేదని సీపీఎం తెలిపింది.