supply disruption
-
భారత సంతతి డ్రగ్స్ ముఠా అరెస్ట్
న్యూయార్క్: నకిలీ బ్రాండింగ్‌తో భారీ ఎత్తున డ్రగ్స్ ఆధారిత మందుల వ్యాపారం సాగిస్తున్న ఓ ముఠా కుట్రను అమెరికా పోలీసులు భగ్నం చేశారు. న్యూయార్క్ పరిధిలోని క్వీన్స్ కేంద్రంగా ఈ ముఠా సాగిస్తున్న కార్యకలాపాలపై నిఘా పెట్టిన పోలీస్ అధికారులు, 8 మంది భారత సంతతి అమెరికన్లను అరెస్ట్ చేశారు. అమెరికాలోని కొరియర్, పోస్టల్ సర్వీసుల ద్వారా వీరు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు విస్తుపోయారు. ఈ విషయమై న్యూయార్క్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘సెషిజాన్ కమల్ దాస్(46), ముకుల్(24), గులాబ్ (45), దీపక్ (43), నారాయణ స్వామి(58), బల్జీత్ సింగ్(29), హర్‌ప్రీత్ సింగ్(28) వికాస్ వర్మ (45)లు భారత్ నుంచి నకిలీ బ్రాండింగ్‌తో నల్ల మందు ఆధారిత మందుల్ని అమెరికాలోకి భారీగా దిగుమతి చేసుకున్నారు. ఈ మందుల్లో హెరా యిన్, ఆక్సికొంటిన్, వికోడిన్, ట్రమడాల్, ఫెంటానేల్ వంటి సింథటిక్ డ్రగ్స్ ఉంటాయి’ అని తెలిపారు. రీ–ప్యాకింగ్‌తో కోట్ల ఆదాయం.. నిందితులు తమ డ్రగ్స్ వ్యాపారానికి న్యూయార్క్ పరిధిలో క్వీన్స్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ పట్టణంలోని ఓ గోదామును అద్దెకు తీసుకున్న 8 మంది నిందితులు.. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న సరుకులను తమ వినియోగదారులకు పంపేవారు. ఇందుకోసం ప్రభుత్వ పోస్టల్ సర్వీసుతో పాటు ప్రైవేటు కొరియర్ సంస్థల సేవలను హాయిగా వాడుకున్నారు. మందులను రీప్యాక్ చేసి తమ వినియోగదారులకు, కొన్ని సంస్థలకు అందించడం మొదలుపెట్టారు. ఇలా 2018–19 మధ్యకాలంలో వీరు కోట్ల రూపాయలు ఆర్జించారు. అయితే 2018 జనవరి నుంచి దేశంలోకి భారీగా నల్లమందు ఆధారిత డ్రగ్స్ దిగుమతి కావడంపై అమెరికా విచారణ సంస్థలు దృష్టి సారించగా ఈ అక్రమ అమ్మకాలు వెలుగులోకి వచ్చాయి. డోస్ ఎక్కువైతే మరణమే.. సింథటిక్ డ్రగ్స్ ఉన్న మందులను వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడటం ప్రమాదకరం. డోస్ ఎక్కువైతే కోమాలోకి వెళ్లిపోతారు. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. ఈ నేపథ్యంలో 8 మంది నిందితులను బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నేరం రుజువైతే కమల్దాస్కు 25 ఏళ్లు, మిగతా నిందితులకు ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. -
ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరా నిలిపివేత
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు ఇంధన సరఫరాలను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిలిపివేశాయి. విశాఖపట్టణం, కొచ్చిన్, మోహాలీ, రాంచి, పుణే, పాట్నా... ఈ ఆరు విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియా విమానాలకు ఇంధన సరఫరాలను గురువారం సాయంత్రం గం. 4 ల నుంచి ఆపేశామని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఎయిర్ ఇండియా సంస్థ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ ఇంధన సరఫరాల నిలిపివేత కారణంగా ఎయిర్ ఇండియా విమాన సర్వీసులకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదని వివరించారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా తమ పనితీరు చాలా బాగుందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆరోగ్యకరమైన నిర్వహణ లాభం సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నామని పేర్కొన్నారు. వాటా విక్రయం ద్వారా నిధుల లభించని పక్షంలో భారీగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకోలేమని తెలిపారు. -
మూడు గంటల పాటు ఆగిన రైలు
విద్యుత్ సరఫరాలో అంతరాయమే కారణం రెండు డీజిల్ ఇంజిన్లను తెప్పించి పంపిన రైల్వే సిబ్బంది చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకోవడంతో ఓ రైలు మూడు గంటల పాటు రైల్వేస్టేషన్లో నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి బెంగళూరుకు వెళుతున్న కంటోన్మెంట్ ప్యాసింజర్ రైలు మంగళవారం అనంతపురం రైల్వే స్టేషన్ దాటి మధ్యాహ్నం 1.57 గంటలకు చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో రైలు ఇంజిన్ ఆగిపోయింది. విషయాన్ని వెంటనే స్టేషన్ మాస్టర్ త్రిపురారికుమార్ బెంగళూరుకు చేరవేసి, ప్రత్యామ్నాయ వ్యవస్థ కల్పించాలని కోరారు. రైల్వే అధికారుల నుంచి అనుమతి వచ్చిన తర్వాత సాయంత్రం 4.45 గంటలకు పుట్టపర్తి నుంచి రెండు డీజిల్ ఇంజిన్లను రప్పించి బెంగళూరుకు పంపించారు. అయితే రైలు మూడుగంటల పాటు నిలిపోవడం...ఆస్టేషన్ కూడా మరీ చిన్నది కావడంతో ఆహారం దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, ఈ రైలు వెళ్లిన కొద్ది సేపటికి లోకమాన్యతిలక్ ఇదే మార్గంలో వెళుతూ బసంపల్లి రైల్వేస్టేషన్ రాగానే ఆగిపోయింది. అయితే సమస్య వెంటనే పరిష్కారం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.