
సాక్షి, ముంబై: వరుసగా ఆటో కంపెనీలు తమ వాహనాల రేట్లను పెంచేస్తున్నాయి. ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్ బాటలో మరో ఆటోదిగ్గజం మారుతి సుజుకి ఇండియా కూడా వినియోగదారులపై ధరల బాంబును పేల్చింది. వివిధ మోడళ్ల వాహనాల ధరలను పెంచుతున్నట్టు మారుతి బుధవారం ప్రకటించింది. ఈ నెల నుంచే తమ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. వస్తువుల ధరలు, విదేశీ మారకం అనిశ్చితి, ఇంధన ధరల పెరుగుదల తదితర ప్రతికూల ప్రభావాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇంధన ధరలు, లాజిస్టిక్స్ వ్యయంతో పాటుగా విదేశీ మారకం రేటు కూడా సంస్థపై ప్రభావం చూపిందని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎస్.ఎస్.కాల్సీ తెలిపారు. ఆయా మోడల్స్ ఆధారంగా ధర పెంపు ఉంటుందని చెప్పారు.
కాగా ప్రస్తుతం మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ ఆల్టో 800 మొదలుకొని సెడాన్ సియాజ్ మోడల్ వరకూ రకరకాల కార్లను అమ్ముతోంది. వీటి ధరలు రూ.2.51 లక్షలు - రూ.11.51 లక్షల వరకూ ఉన్నాయి. సెడాన్ సియాజ్ (మధ్య సైజ్) ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం రూ.11.51లక్షలుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment