
సాక్షి, అమరావతి: దేశంలో 2030 నాటికి పెట్రోల్, డీజిల్ కార్లు అమ్మడానికి వీలు లేదు.. వీటి స్థానంలో అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకు వస్తామంటూ ప్రకటించడమే కాకుండా దానికి అనుగుణంగా ఈ–వాహన్ పాలసీని రూపొందించే పనిలో కేంద్రం ఉంది. సాంప్రదాయ ఇంధన వనరుల విని యోగం తగ్గించి, వాటి స్థానే సహజ వన రులను వినియోగించడం ద్వారా కాలుష్య ఉద్గారాలను తగ్గించాలన్నది ప్రధాన లక్ష్యం. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇప్పటికే కార్ల వినియోగంలో సరిబేసి విధానాన్ని అమలు చేస్తున్నాయి. కేవలం మన దేశమే కాదు ప్రప చంలో ఇతర దేశాలు కూడా ఈ వాహనాల బాట పట్టాయి. ఇప్పటికే ఈ దేశాల్లో ఈ వాహనాల వినియోగం బాగానే ఉంది. నెద ర్లాండ్స్, నార్వేలు 2025 నాటికి పూర్తిస్థాయి ఈ–వాహన దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకోగా బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు 2040ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. అంతేకాదు బ్రిటన్ మరో అడుగు ముందుకేసి 2,050 నుంచి రోడ్లపై పెట్రోల్ వాహనాలను తిర గనివ్వమని ప్రకటించింది కూడా. చైనా, అమెరికాలు కూడా ఎలక్ట్రిక్ వాహన వినియో గాన్ని ప్రోత్సహిస్తున్నా ఎటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. దీంతో ఇప్పుడు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఈ వాహనాల తయారీపై దృష్టిపెట్టడమే కాకుండా భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయి. 2018 నుంచి ఈ–వాహనాలను విడుదల చే యడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.
మనదేశంలో వీలయ్యేనా...
మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ప్రోత్సహించడానికి 2013లో ఒకటి, 2015లో మరో పథకాన్ని ప్రవేశపెట్టినా వాటి ఫలి తాలు అంతంత మాత్రంగా>నే ఉన్నాయి. 2013లో నేషనల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ మిషన్ (ఎన్‌ఈఎంఎంపీ)ను ప్రారంభించి 2020 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను 60–70 లక్షలకు చేర్చాలని లక్ష్యం గా నిర్దేశించుకున్నారు. కాని ఈ లక్ష్యానికి దూరంగా ప్రస్తుతం దేశంలో కేవలం 4 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలే తిరుగుతున్నాయి. ఆ తర్వాత 2015లో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) పేరుతో ఈ–వా హన తయారీని ప్రోత్సహిచే పథకాన్ని తీసు కొచ్చారు. ఈ పథకంలో హైబ్రీడ్ బైక్ తయా రీకి రూ.29,000, కార్లకు రూ.1.39 లక్షల వరకు సబ్సిడీ ప్రకటించింది. ఇందుకోసం చెల్లించే సబ్సిడీ కింద రూ.795 కోట్లు కేటా యిస్తే రూ.190 కోట్లు మాత్రమే క్లెయిమ్ జరి గింది. ఈ ఫెమా పథకం కింద ఇప్పటి వరకు 1,45,618 వాహనాలు అమ్మకాలు జరగ్గా.. దీనివల్ల రోజుకు 35,441 లీటర్ల ఇంధన వినియోగం తగ్గినట్లు నీతి ఆయోగ్ అంచనా.
పాలసీ మరింత ఆలస్యం...
2030 నాటికి అన్నీ ఈ–వాహనాల అమ్మకాలే జరిపితే కలిగే ప్రయోజనం ఇందుకు తీసు కోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ అమెరికాకు చెందిన రాకీ మౌంటెన్ ఇనిసి ్టట్యూట్‌తో కలసి ఒక సర్వే నిర్వహించింది. 2016–17లో ఇండియా వినియోగించిన ఇంధనం 194 మిలియన్ మెట్రిక్ టన్నులు అయితే ఇందులో సగానికి పైగా వాటా రవాణా రంగానిదే. గత పదేళ్ల నుంచి సగటు ఇంధన వినియోగ వృద్ధి 4.9 శాతంగా ఉంటే గత మూడేళ్ల నుంచి ఈ రేటు 7 శాతంగా ఉందని ఆ నివేదిక వెల్లడించింది. పదేళ్ల నుంచి డీజీల్ వినియోగం 5.9 శాతం, పెట్రోల్‌లో 9.9 శాతం చొప్పున వృద్ధిరేటు నమోదవుతోంది. 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసు కువస్తే సాంప్రదాయ ఇంధన వినియోగం 64 శాతం, కార్బన్ ఉద్గారాలు 37 శాతం తగ్గు తాయని అంచనా వేసింది. దీంతో 156 మెట్రి క్ టన్నుల పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గి రూ. 3.9 లక్షల కోట్ల ఇంధన వ్యయం ఆదా అవుతుందని అంచనా వేసింది. దీనికి అను గుణంగా కొత్త ఈ–వాహన పాలసీని ఈ డిసెంబర్‌లోగా విడుదల చేయాలని ప్రభు త్వం భావించినా.. నీతి ఆయోగ్ ముసాయి దా ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో దీన్ని తిరిగి పునః సమీక్షిం చాలని ఆదేశించింది. దీంతో పాలసీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ముసాయిదాలో నీతి ఆయోగ్ ప్రస్తావిం చిన బ్యాటరీ స్వాపింగ్ విధానాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యతిరేకిస్తున్నారు. చార్జింగ్ పాయింట్ల స్థానంలో బ్యాటరీలు మార్చుకునే స్వాపింగ్ విధానం మంచిదని నీతి ఆయోగ్ సూచించగా అది ఇండియాలో సాధ్యం కాదన్నది మంత్రిగారి వాదన.
ప్రధాన అడ్డంకులు ఇవే...
దేశంలో ఈ–వాహనాలు ప్రవే శపెట్టాలని ఉన్నా దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు లేవు. ఇప్పటికీ దేశంలో 4,141 గ్రామాలకు విద్యుత్ సౌకర్యమే లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనా లకు అవసరమైన చార్జింగ్ పాయింట్లు లేకపోవడం అడ్డంకిగా మారింది. చైనాలో 2,15,000 చార్జింగ్ పాయింట్లు ఉంటే మన దేశంలో 350 చార్జింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి 50 దేశీయ, అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరుపు తోంది. ఇవి వచ్చే ఏడాదిలోగా పనులు మొదలు పెట్టే అవకాశాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ–వాహనాలను విడుదల చేస్తున్నా దేశంలో తగిన మౌలిక వసుతులు లేకపోవ డం స్థానికంగా విడుదల చేయడానికి మరింత ఆలస్యమవుతుందని జేఎల్‌ఆర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరి తెలిపారు. అంతగా చార్జింగ్ పాయింట్లు లేకపోవడంతో ప్రస్తుతం తక్కువ దూరం లేదా నిర్దేశిత దూరం వెళ్లి వచ్చే ఈ–వాహనాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ హెడ్ గిరీష్ వాఘ్ తె లిపారు. ఇవే కాకుండా బ్యాంటరీల సామర్థ్యం, వాటి ధరలు, చార్జింగ్ సమయం, బ్యాటరీల రీ–సైక్లింగ్ వీట న్నింటికీ మించి విని యోగదారుని ఆలోచనా విధానం వంటి వాటిపైనే దేశంలో ఈ–వాహనాల విని యోగం విజయ వంతమవుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే బ్యాటరీల ధరలు తగ్గించి.. తక్కువ సమ యంలో ఎక్కువ దూరం ప్రయాణించే విధంగా బ్యాటరీలను కంపెనీలు అందు బాటులోకి తీసు కొచ్చాయి. ఇవన్నీ ఇలా ఉండగా ఇప్పు డున్న ఈ టెక్నాలజీ మారిపోయి హైడ్రోజన్ వంటి ప్రత్యా మ్నాయ ఇంధనాలు అందు బాటులోకి వస్తే పరిస్థితి ఏంటి? అన్న మరో ప్రశ్న తలె త్తుతోంది. వీటన్నింటికీ సరైన సమాధానం దొరికితేనే ఈ–వాహనాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు వస్తారని ఆటోమొబైల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment