చమురు స్మగ్లర్లపై సౌదీ వాయుసేనలు జరిపిన దాడుల్లో 20 మంది భారతీయులు మృతిచెందారు.
యెమెన్: చమురు స్మగ్లర్లపై సౌదీ వాయుసేనలు జరిపిన దాడుల్లో 20 మంది భారతీయులు మృతిచెందినట్లు తెలుస్తోంది. సౌదీ దేశాల వాయుసేనలు సంయుక్తంగా యెమెన్ లోని హెదాయ్ పోర్టు సమీపంలో మంగళవారం ఆయిల్ స్మగ్లర్లపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో కనీసం 20 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
యెమెన్ లోని హెదాయ్ పోర్టుకు సమీపంలో వాయుసేనలు ఆకస్మికంగా చేసిన దాడిలో రెండు బోట్లు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు, మత్యకారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనలో భారత దేశానికి చెందిన కార్మికులు అధిక సంఖ్యలో మృతి చెంది ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాయుసేనలు చేసిన దాడుల్లో 12 మంది షిటీ తిరుగుబాటు దారులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. గతవారం తిరుగుబాటు దారులు చేసిన దాడిలో 45 మంది ఎమిరేట్స్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.