
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు కొండేక్కుతున్నాయి. పెట్రోలు, డిజీల్ ధరలు పెరగడంతో సామాన్యుడి నెత్తిమీద మరింత భారంపడనుంది. సుమారు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటింది. కాగా వాహనాల్లో ఇంధన వాడకం, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి హైదరాబాద్‌కు చెందిన డేవిడ్ ఎష్కోల్ సరికొత్త ఆవిష్కరణ రూపొందించారు. అందుకోసం ‘5M మైలేజ్ బూస్టర్’ను ఆవిష్కరించారు. ఈ వ్యవస్థతో ఇంజిన్ నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా వెహికిల్ మైలేజీను కూడా పెంచుతుంది.
5M మైలేజ్ బూస్టర్‌లో ముఖ్యంగా ఐదు రకాల ప్రయోజనాలను కల్పించే వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ బూస్టర్‌ను వాహనాలకు అమర్చడంతో.. అధిక మైలేజీను, అధిక పిక్ అప్‌ను, స్మూత్ డ్రైవింగ్, అధిక టార్క్‌ను, పొందవచ్చునని డేవిడ్ తెలిపారు. తక్కువ మోతాదులో కర్బన ఉద్గారాలను వెలువడేలా చేస్తుంది. 5M మైలేజ్ బూస్టర్ ఇంజిన్‌కు అమర్చనున్నారు.
బైక్ సీసీ పవర్ ఆధారంగా నిర్దిష్ట సమయంలో అల్ట్రా సోనిక్ తరంగాలను, గ్యాస్ రూపంలోని ప్లాస్మాను మైలేజ్ బూస్టర్‌తో ఇంజిన్‌కు పంపిస్తారు. కాగా ఇప్పటివరకు సుమారు 8 వేల వాహనాలకు 5M మైలేజ్ బూస్టర్‌ను అమర్చారు. 100సీసీ నుంచి 10,000 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ లకు మైలేజ్ బూస్టర్‌ను ఏర్పాటుచేయవచ్చునని డేవిడ్ పేర్కొన్నారు. కాగా ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ తో జతకడితే ఈ టెక్నాలజీను సామాన్యులకు అందుబాటులో వస్తోందని డేవిడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment