ఇంధన పొదుపుతోనే ఆర్టీసీకి భవిష్యత్తు
ఇంధన పొదుపుతోనే ఆర్టీసీకి భవిష్యత్తు
Published Tue, Dec 20 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM
- ధరలు పెరుగుతుండడం సంస్థకు భారమే
- కేఎంపీఎల్ పెంచేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలి
- ఆర్టీసీ కన్సల్టెంట్, ట్రైనర్ హనీఫ్
కర్నూలు(రాజ్‌విహార్): ఇంధనం పొదుపు చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్సార్టీసీ కన్సల్టెంట్, ట్రైనర్ ఎండీ హనీఫ్ అన్నారు. స్థానిక బళ్లారీ చౌరాస్తా సమీపంలోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో మంగళవారం ఇంధన పొదుపుపై ఈనెల 31వ తేదీ వరకు జరిగే శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డీజిల్, ఆయిల్ పొదుపుపై శిక్షణలో వివరించారు. సంస్థ ఆదాయంలో 30శాతం కేవలం డీజిల్‌కే ఖర్చవుతోందని, దీనిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చమురు ధరలు పెరుగుదలకు హద్దు లేకుండా పోయిందని, దీంతో సంస్థపై తీవ్ర భారం పడుతోందన్నారు. ఈ క్రమంలో మైలేజీని పెంచుకుంటే కేఎంపీఎల్ (కిలో మీటర్ పర్ లీటర్)ను అధికంగా చూపవచ్చని సూచించారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందని, మెకానిక్‌లు, డీఎంలు, శ్రామిక్, డ్రైవర్లు ఇలా ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని జాగ్రత్తలు పాటించాలని డెమో ద్వారా వివరించారు. శిక్షణా కార్యక్రమంలో ఆర్‌ఎం జి. వెంకటేశ్వర రావు, ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రజియా సుల్తానా, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ రమేష్‌కుమార్, 12 డిపోల మేనేజర్లు, మెకానికల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ మేనేజర్లు పాల్గొన్నారు.
Advertisement