పెట్రోల్ బంక్ల్లో ఫిక్స్డ్ పెట్టేశారు... | Petrol bunks fix maximum limit of Rs 500 on fuelling | Sakshi
Sakshi News home page

పెట్రోల్ బంక్ల్లో ఫిక్స్డ్ పెట్టేశారు...

Published Wed, Nov 9 2016 3:20 PM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

పెట్రోల్ బంక్ల్లో ఫిక్స్డ్ పెట్టేశారు... - Sakshi

పెట్రోల్ బంక్ల్లో ఫిక్స్డ్ పెట్టేశారు...

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా  రూ.500, 1000 నోట్ల ఆకస్మిక రద్దుతో  గందరగోళ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంక్లు, హాస్పటల్స్, రైల్వేస్టేషన్లు, పాలకేంద్రాలు, ఎయిర్పోర్టుల్లో ఐదు వందలు, వెయ్యి రూపాయిల నోట్లు చెలామణి అవుతాయని కేంద్రం చెప్పినప్పటికీ చాలా ప్రాంతాల్లో అవి అమలు కావడం లేదు. పలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో అయిదు వందల నోట్లను తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు పలు పెట్రోల్ బంక్ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిల్లర సమస్య తలెత్తడంతో కొన్ని పెట్రోల్ బంక్ల్లో మినిమమ్ రూ.500 అయితేనే పెట్రోల్ పోస్తామని తెగేసి చెప్పడంతో వాహనదారులు గత్యంతరం లేక ఒప్పుకోవాల్సి వస్తోంది. కాగా పెట్రోల్ బంక్లు, గ్యాస్ స్టేషన్లలో రూ.500,1000 నోట్లను అనుమతించాలని తాము ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. నోట్ల మార్పిడి విషయంలో నవంబర్ 11 వరకూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన పేర్కొన్నారు.

ఇక ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అయిటే 500, 1000 నోట్లను అసలు అనుమతించడం లేదు. టికెట్‌ కౌంటర్ దగ్గర పెద్దనోట్లు తీసుకురావద్దని నోటీసు పెట్టేశారు. కనీసం టీ తాగాలన్నా పైసా లేక ప్రయాణికులు స్టేషన్‌లో దిక్కులు చూస్తూ నిలబడ్డారు. కౌంటర్‌ దగ్గరే 500నోట్లు మార్చుకునేందుకు పడిగాపులు పడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement