మరో వివాదం.. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్‌' వంతు | 'Prime Minister Of Bharat' Adds Fuel To Name-Change Fire - Sakshi
Sakshi News home page

మరో వివాదం: ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్‌' వంతు

Published Wed, Sep 6 2023 11:02 AM | Last Updated on Wed, Sep 6 2023 12:12 PM

Prime Minister Of Bharat Adds Fuel To Name Change Fire - Sakshi

ఢిల్లీ: జీ-20 డిన్నర్ మీటింగ్‌ ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పేర్కొనడం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ప్రధాని మోదీని కూడా 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌' అని పేర్కొన్నారు. ఏసియన్‌-ఇండియా సమ్మిట్‌, 'ఈస్ట్‌ ఏసియా సమ్మిట్‌' లకు  ప్రధాని మోదీ బుధవారం, గురువారం వరుసగా హాజరుకావాల్సి ఉండగా.. ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో భారత ప్రధానిని 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌' అని పేర్కొనడంతో పేరు మార్పు వివాదం మరింత ముదిరింది.

20వ 'ఏసియన్-ఇండియా సమ్మిట్',  'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా' రెండు పదాలను ఒకే ప్రకటనలో విడుదల చేయడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంతటి గందరగోళంలో ఉందో ఈ విషయంతో స్పష్టమవుతోందని వెల్లడించింది. ఇండియా పేరుతో ప్రతిపక్షాలు ఏకమవ్వడంతోనే బీజేపీ నాయకులు ఈ డ్రామా క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు.

అయితే.. జీ-20 డిన్నర్ మీటింగ్‌కి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి అధికారిక ఆహ్వానాన్ని పంపారు అధికారులు. ఇందులో సాంప్రదాయంగా ఉపయోగించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులు ప్రిసెడెంట్ ఆఫ్ భారత్ అని సంభోదించారు. దీంతో ఇండియా పేరును రానున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌లో భారత్‌గా మార్చనున్నారనే ఊహాగానాలు వచ్చాయి. 

బీజేపీని ఓడించడానికి దేశంలో ప్రధానంగా 28 ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. విపక్ష కూటమి పేరు ఇండియా ఉండటం బీజేపీకి నచ్చనందునే  దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. అటు.. తమ కూటమి పేరును త్వరలో భారత్‌గా నామకరణం చేస్తామని కూడా పలువురు నాయకులు చెప్పారు. 

దేశం పేరును భారత్‌గా పిలవడం స్వాగతిస్తున్నామని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇది దేశానికి గర్వకారణం అని అన్నారు. అటు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఆ వెబ్‌సైట్లకు కష్టాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement