భారత్- మలేషియాల దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేదిశగా మరో ముందడుగు పడబోతోంది. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రధాని మోదీతో భేటీకానున్నారు. మూడు రోజుల భారత్ పర్యటన నిమిత్తం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం న్యూఢిల్లీ చేరుకున్నారు.
ప్రధాని హోదాలో ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) మలేషియా ప్రధానితో విస్తృత చర్చలు జరపనున్నారు. అనంతరం భారతీయ కార్మికుల రిక్రూట్‌మెంట్‌తో సహా పలు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేయనున్నాయి. భారతదేశం నుండి మలేషియాకు అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా అనేవి ఇరు దేశాల్లో ఆందోళనకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత కార్మికుల నియామకంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరనుంది.
మలేషియాలో నివసిస్తున్న వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్‌ను అప్పగించే అంశంపై కూడా ప్రధానితో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మహ్మద్‌తో భారత్ ఈ అంశాన్ని లేవనెత్తింది. అయితే దీనిపై ఎటువంటి పురోగతి కానరాలేదు. ఆర్థిక మోసం కేసులో నాయక్ భారత్‌లో వాంటెడ్ గా ఉన్నాడు. మలేషియా ప్రధాని ఇబ్రహీం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశం కానున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మలేషియా ప్రధానిని కలుసుకున్నారు.
#WATCH | Prime Minister of Malaysia Dato’ Seri Anwar bin Ibrahim arrives in New Delhi on a three-day state visit to India
He was received by MoS V Somanna pic.twitter.com/rfXPn48Zph— ANI (@ANI) August 19, 2024
Comments
Please login to add a commentAdd a comment