
చిన్న చిన్న పడవలైతే గాలివాలుకు అలా ముందుకు సాగిపోతాయి గాని, భారీ నౌకలు సముద్రంలో ముందుకు సాగాలంటే ఇంధనం కావాలి కదా! కేవలం గాలితో ఇంత పెద్ద నౌక సముద్రంలో ఎలా ప్రయాణం సాగించగలుగుతుందనేగా మీ అనుమానం? ఇందులో అణుమాత్రమైనా అనుమానానికి ఆస్కారం లేదు. ఫొటోలో కనిపిస్తున్న ఈ నౌక పూర్తిగా గాలి ఆధారంగానే నడుస్తుంది. కెనడాకు చెందిన ‘కేఫ్ విలియమ్’ తన అంతర్జాతీయ కాఫీ రవాణా కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ నౌక పూర్తిగా పవనశక్తినే ఇంధనంగా మార్చుకుని, సముద్రంలో ప్రయాణిస్తుంది. ‘కేఫ్ విలియమ్’ కోసం ‘సెయిల్ కార్గో’ సంస్థ ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నౌక 2023లో తొలి సముద్రయానం చేయనుంది.
చదవండి: Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment