
శంషాబాద్ : శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. విమానంలో ఇంధనం నింపే క్రమంలో ఏర్పడిన లీకేజీని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. జెడ్డా నుంచి ఇండోనేసియా వెళ్తున్న సిటీలింక్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఇంధనం కోసం ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది.
ఇంధనం నింపుతున్న సమయంలో లీకేజీ ఏర్పడి రన్‌వేపై పడింది. దీన్ని వెంటనే గమనించిన సిబ్బంది ఫైర్ ఇంజిన్‌ల సహాయంతో రన్‌వేను శుభ్రం చేశారు. సరైన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అయ్యింది.