
పుణే: పర్యావరణ అనుకూల సీఎన్‌జీ ఇంధనంతో నడిచే మోటార్‌సైకిళ్ల తయారీపై ద్విచక్ర వాహనాల దిగ్గజం బజాజ్ ఆటో కసరత్తు చేస్తోంది. జూన్ కల్లా ఈ బైకు మార్కెట్లోకి రాగలదని కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. మైలేజీని కోరుకునే కస్టమర్ల కోసం రూపొందిస్తున్న ఈ వాహనాన్ని వేరే బ్రాండ్ కింద ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. వచ్చే అయిదేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలపై (సీఎస్‌ఆర్) రూ. 5,000 కోట్లు వెచి్చంచనున్నట్లు ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు.
పెట్రోల్‌తో నడిచే మోటర్‌సైకిళ్లతో పోలిస్తే దీని ధర కొంత అధికంగా ఉండవచ్చని అంచనా. కస్టమర్ల సౌకర్యార్ధం పెట్రోల్, సీఎన్‌జీ ఇంధనాల ఆప్షన్లు ఉండేలా ట్యాంకును ప్రత్యేకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉండటం వల్ల తయారీ కోసం మరింత ఎక్కువగా వెచి్చంచాల్సి రానుండటమే ఇందుకు కారణం. గ్రూప్‌నకు చెందిన అన్ని సీఎస్‌ఆర్, సేవా కార్యక్రమాలను ’బజాజ్ బియాండ్’ పేరిట సంస్థ నిర్వహించనుంది. దీని కింద ప్రధానంగా నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచడంపై దృష్టి పెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment