Rajiv Bajaj
-
అవి స్టార్టప్‌లు కావు.. ‘అప్‌స్టార్ట్‌లు’
ముంబై: చాలా వరకు స్టార్టప్‌లది ఆరంభ శూరత్వమేనని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. అవి వ్యూహాలను, బ్రాండ్‌ను, టెక్నాలజీని నిరుపయోగంగా మార్చేస్తుండగా.. విజయవంతమైన కంపెనీలు మాత్రం వాటిని దన్నుగా చేసుకొని బ్రాండ్‌ను వృద్ధి బాటలో పయనించేలా చేస్తున్నాయని చెప్పారు. ఈ రెండింటి మధ్య అతిపెద్ద వ్యత్యాసం ఇదేనన్నారు.ఓ టీవీ చానెల్ నిర్వహించిన గ్లోబల్ లీడర్షిప్ సదస్సులో మాట్లాడుతూ.. ‘ఎలాంటి వ్యూహం లేకుండా మార్కెట్లోకి అడుగుపెట్టేవి ‘అప్‌స్టార్ట్‌లు’. అవి తమ వ్యూహాలు, టెక్నాలజీలు, ఉత్పత్తులను చేజార్చుకుంటాయి. ప్రతి నెలా ధరలను తగ్గిస్తూ బ్రాండ్‌కు తూట్లు పొడుస్తాయి. ఫ్యాక్టరీల్లో, ట్రక్కుల్లో, డీలర్‌షిప్‌ల వద్ద, రోడ్లపై ఉత్పత్తులు తగలబడిపోతుంటాయి. దీనికి పూర్తి భిన్నంగా స్టార్టప్‌లు వ్యూహాన్ని రూపొందించుకుంటాయి. టెక్నాలజీని, బ్రాండ్‌ను, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతో పాటు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. ఉద్యోగులకు సంతృప్తి అందిస్తాయి. పటిష్టమైన ఆదాయాలే కాకుండా, లాభాలను కూడా కళ్లజూస్తాయి.ఇక మూడో కోవలోకి వచ్చేవి విజయవంతమైన కంపెనీలు. అవి సరైన వ్యూహాలు, టెక్నాలజీ వినియోగంతో అద్భుతమైన బ్రాండ్లుగా అవతరిస్తాయి’ అని పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే పోటీలో స్టార్టప్‌లు, పేరొందిన సంస్థల్లో ఏవి విజయం సాధిస్తాయనే ప్రశ్నకు రాజీవ్ బజాజ్ ఈ విధంగా బదులిచ్చారు. బైక్లయినా, ఇంకా ఏ ఇతర వ్యాపారమైనా సరే 90–95 శాతం కొత్త వ్యాపారాలు, కొత్త ఉత్పత్తులు, సర్వీసులన్నీ విఫలమవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఏ పరిశ్రమలో చూసినా ఇది వాస్తవమన్నారు. -
సీఎన్జీ బైక్‌పై బజాజ్ ఆటో కసరత్తు
పుణే: పర్యావరణ అనుకూల సీఎన్జీ ఇంధనంతో నడిచే మోటార్‌సైకిళ్ల తయారీపై ద్విచక్ర వాహనాల దిగ్గజం బజాజ్ ఆటో కసరత్తు చేస్తోంది. జూన్ కల్లా ఈ బైకు మార్కెట్లోకి రాగలదని కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. మైలేజీని కోరుకునే కస్టమర్ల కోసం రూపొందిస్తున్న ఈ వాహనాన్ని వేరే బ్రాండ్ కింద ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. వచ్చే అయిదేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యతా కార్యక్రమాలపై (సీఎస్ఆర్) రూ. 5,000 కోట్లు వెచి్చంచనున్నట్లు ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. పెట్రోల్‌తో నడిచే మోటర్‌సైకిళ్లతో పోలిస్తే దీని ధర కొంత అధికంగా ఉండవచ్చని అంచనా. కస్టమర్ల సౌకర్యార్ధం పెట్రోల్, సీఎన్జీ ఇంధనాల ఆప్షన్లు ఉండేలా ట్యాంకును ప్రత్యేకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉండటం వల్ల తయారీ కోసం మరింత ఎక్కువగా వెచి్చంచాల్సి రానుండటమే ఇందుకు కారణం. గ్రూప్‌నకు చెందిన అన్ని సీఎస్ఆర్, సేవా కార్యక్రమాలను ’బజాజ్ బియాండ్’ పేరిట సంస్థ నిర్వహించనుంది. దీని కింద ప్రధానంగా నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచడంపై దృష్టి పెట్టనుంది. -
పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?
యూత్ డ్రీమ్ బైక్ ఏదీ అంటే పల్సర్ బైక్ ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు. అలాంటి ఐకానిక్ పల్సర్ బైక్‌ను భారత దేశంలో పరిచయం చేసిన బిలియనీర్, రాహుల్ బజాజ్ కుమారుడు రాజీవ్ బజాజ్. కుటుంబ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ బజాజ్ పల్సర్ లైన్ మోటార్ బైక్‌లను లాంచ్ చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. యువతరం అభిరుచులకు అనుగుణంగా ఇవి రావడంతో బజాజ్ కష్టతరమైన వ్యాపారాన్ని మలుపు తిప్పింది. బజాజ్ ఆటో సీఎండీ రాజీవ్ నికర విలువ తదితర విశేషాలు తెలుసుకుందాం! (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ పెద్ద కుమారుడు. 90వ దశకం చివరలో తన కుటుంబ వ్యాపారంలో చేరినప్పుడు, దేశీయ తిరుగులేని ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ కష్టాల్లో ఉంది. అంతర్జాతీయ జాయింట్ వెంచర్ కంపెనీలచే తయారైన మోటార్‌సైకిళ్లను నెమ్మదిగా కోల్పోతోంది. ఈ సమయంలో రాజీవ్ తన సొంత మోటార్‌సైకిళ్లను తయారీపై ఫోకస్ పెట్టారు. అలా బజాజ్ పల్సర్ మార్కెట్లోకి వచ్చింది. ఇక అప్పటినుంచి టూ వీలర్ మార్కెట్లో దూసుకుపోతున్నారు. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్) ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో. మహాత్మా గాంధీ ఆరాధకుడైన జమ్నాలాల్ బజాజ్ (రాజీవ్ ముత్తాత) 1926లో ఈ సంస్థను స్థాపించారు. ఆతరువాత దివంగత రాహుల్ బజాజ్( రాజీవ్ తండ్రి) ఫిబ్రవరి 2022లో మరణించే వరకు ప్రముఖ బజాజ్ గ్రూప్‌కు ఎమెరిటస్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2001లో భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, స్టాక్ మార్కెట్ పతనం ఇది కంపెనీపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఒకదశలో బజాజ్ ఆటో త్వరలో మూసివేయబడుతుందని అంచనాలుకూడా వచ్చాయి. ప్రస్తుతం సీఎండీగా రాజీవ్ కంపెనీని విజయ పథంలో నడిపిస్తున్నారు. కంపెనీ కొత్త లాంచింగ్స్, టెక్నాలజీని అందిపుచ్చుకుని కంపెనీని అభివృద్ధిలో నడిపిస్తున్నారు. ద్విచక్ర వాహనం, బజాజ్‌ఫిన్ సర్వ్(ఆర్థిక సేవలు), ఎలక్ట్రికల్ ఉపకరణాల పరిశ్రమలతో సహా 40 వ్యాపారాలు ఈ రోజు బజాజ్ గ్రూప్‌లో ఉన్నాయి. రాజీవ్ బజాజ్ ఎవరు? 1966 డిసెంబర్ 21న రాజీవ్ బజాజ్ జన్మించారు. 2005లో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని మలుపు తిప్పిన ఘనతను సాధించిన పల్సర్ లైన్ మోటార్‌బైక్‌లతో పాటు తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) సహా కొత్త ఉత్పత్తులతో ప్రతిభను చాటు కుంటున్నారు. పూణేలోని అకుర్డిలో, రాజీవ్ బజాజ్ సెయింట్ ఉర్సులా ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తరువాత 1988లో పూణే విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని, 1990లో వార్విక్ విశ్వవిద్యాలయం నుండి మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు బజాజ్ ఆటోకు తయారీ, సరఫరా గొలుసు (1990-95), R&D,ఇంజనీరింగ్ (1995-2000), మార్కెటింగ్ అండ్ సేల్స్ (2000-2005) విభాగాల్లో సేవలందించారు. ఏప్రిల్ 2005 నుండి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం 2022లో రాజీవ్ బజాజ్ నికర విలువ రూ. 35,600 కోట్లు (4.3 బిలియన్లు డాలర్లు). రాజీవ్‌కు యోగా అన్నా హోమియోపతీ వైద్య విధానం అన్నా చాలా ఇష్టమట. రాజీవ్ బజాజ్‌కి ఇష్టమైన సినిమా సన్నివేశాలలో ఒకటి చాలా ఆసక్తి కరం. 2004 నాటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ట్రాయ్ మూవీ ప్రారంభ సన్నివేశం అంటే ఇష్టం. ఈ దృశ్యాన్ని తన సహోద్యోగులకు చూపించి మరీ కంపెనీని ముందుకు తీసుకుపోయేలా ప్రోత్సహిస్తారట. గొప్ప యోధునిగా గుర్తుంచుకోవడానికి గ్రీకు యోధుడు ఎచిల్లీస్ (బ్రాడ్‌పిట్ హీరో) పడిన తపనను గుర్తు చేసేవారట. బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్, రాజీవ్ సోదరుడు సంజీవ్ కూడా బిలియనీరే. రాహుల్ బజాజ్ చిన్న కుమారుడు సంజీవ్ బజాజ్దక్షిణ ముంబైలోని అత్యంత విలాసవంతమైన రూ.104 కోట్ల విలువైనఅపార్ట్మెంట్లను కొనుగోలు చేయడం విశేషం. భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో బజాజ్ కుటుంబం ఒకటి. ఆ బ్యాంకును దోచుకోక తప్పదు రాయల్ ఎన్ఫీల్డ్ ఆధిపత్య సెగ్మెంట్లో పోటీపై స్పందించిన రాజీవ్ ప్రముఖ అమెరికన్ దొంగ విలియం సుట్టన్ ఉదాహరణతో తన కంపెనీ ఎత్తుగడలను సమర్థించుకోవడం గమనార్హం. అమెరికాలో విలియం ఫ్రాన్సిస్ సుట్టన్ అనే ప్రసిద్ధ బ్యాంకు దోపిడీదారుడున్నాడు. మీరు బ్యాంకును ఎందుకు దోచుకుంటున్నారు అని అడిగినప్పుడు డబ్బు అక్కడే ఉంది కాబట్టి అని చెబుతాడు.. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ డబ్బు ఎక్కడ ఉంటే ఆ బ్యాంకును దోచుకోవడం తప్ప తమకు వేరే మార్గం లేదని చెప్పుకొచ్చారు రాజీవ్ బజాజ్. (విలియం ఫ్రాన్సిస్ సుట్టన్ నలభై సంవత్సరాలలో రెండు మిలియన్ డాలర్లకు పైగా దోచుకున్నాడు) రాహుల్ బజాజ్ 1965లో రాహుల్ బజాజ్ బజాజ్ గ్రూప్ పగ్గాలు చేపట్టిన సంవత్సరానికి కొత్త శిఖరాలకు చేర్చారు. బజాజ్ ఆటో ఆదాయం రూ.72 మిలియన్ల నుండి రూ.46.16 బిలియన్లకు పెరిగింది. భారతదేశంలోని అత్యుత్తమ సంస్థల్లో ఒకదానిగా తీర్చిదిద్దడంలో ఆయనకృషి చాలా ఉంది. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం దేశంలోని 20వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రాహుల్‌బజాజ్ 2002లో, దేశీయ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నారు. 83 ఏళ్ల వయసులో 2022 లో ఆయన కన్నుమూశారు. -
వేలం వెర్రిగా ఎలక్ట్రిక్ వాహనాలు
పుణె: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అంశం వేలం వెర్రిగా మారిందని, ఈవీ వ్యాపారంతో సంబంధం లేని వాళ్లంతా కూడా పరిశ్రమలోకి వస్తున్నారని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఆక్షేపించారు. అందుకే అగ్నిప్రమాదాల్లాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. పుణెలోని అకుర్దిలో బజాజ్ ఆటో అనుబంధ సంస్థ చేతక్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ప్రత్యేక ప్లాంటును ఆవిష్కరించిన సందర్భంగా బజాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇది కేవలం అగ్నిప్రమాదాల గురించి మాత్రమే కాదు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ల వాహనాల్లోనూ ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈవీల విషయంలో సమస్యంతా తయారీ ప్రక్రియతోనే ఉంటోంది. ఈవీల వ్యవహారం వేలం వెర్రిగా మారడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈవీలతో సంబంధం లేని వాళ్లకు ఈ వ్యాపారంతో ఏ పని ఉంది? ఈ విధానాన్ని సరిచేయాలి. బహుశా, ప్రభుత్వంలోని సంబంధిత అధికార వర్గాలు ఈవీల నిబంధనలను సడలించారేమో. అందుకే ఈవీలు మార్కెట్‌ను వరదలా ముంచెత్తుతున్నాయి‘ అని బజాజ్ పేర్కొన్నారు. ‘తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాల పేరుతో దేన్నైనా రోడ్డు మీదకు తీసుకొస్తున్నారు. మరి స్కూటర్లకు అగ్నిప్రమాదాలు జరగకుండా మరేమవుతుంది?‘ అని ఆయన ప్రశ్నించారు. ప్లాంటుపై రూ. 750 కోట్ల పెట్టుబడులు కొత్తగా ఏర్పాటు చేసిన ఈవీల తయారీ ప్లాంటుపై చేతక్ టెక్నాలజీ (సీటీఎల్), దాని వెండార్ భాగస్వాములు రూ. 750 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నారు. సుమారు 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటు ఉంటుంది. వార్షికంగా దీని తయారీ సామర్థ్యం 5 లక్షల ద్విచక్ర వాహనాలుగా ఉంటుంది. 2019 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన చేతక్ ఈ–స్కూటర్లను ఇప్పటివరకూ 14,000 పైచిలుకు విక్రయించామని, 16,000 పైగా బుకింగ్స్ ఉన్నాయని బజాజ్ తెలిపారు. ‘చేతక్ అనేది సిసలైన మేక్ ఇన్ ఇండియా సూపర్‌స్టార్. అది ఎంతో మంది వాహనప్రియుల అభిమానం చూరగొంది. దేశీయంగానే డిజైన్ చేసి, ఇక్కడే నిర్మించిన ఎలక్ట్రిక్ చేతక్ .. మా పటిష్టమైన పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలకు, తయారీలో దశాబ్దాల అనుభవానికి, వినియోగదారులు .. ఉత్పత్తులపై మాకున్న లోతైన అవగాహనకు నిదర్శనం‘ అని బజాజ్ తెలిపారు. -
మేము గొర్రెల్లా తలఊపం: రాజీవ్ బజాజ్
ముంబై: కరోనా అంటువ్యాధిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం15 రోజుల లాక్‌డౌన్‌ను పరిశీలిస్తున్నట్లు వచ్చిన వార్తలపై బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్ స్పందించారు. ఏడాది క్రితం మెడికల్ మౌలిక వసతుల లేమి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలైన సంగతిని రాజీవ్ బజాజ్ గుర్తు చేశారు. గతేడాది ప్రపంచంలోకెల్లా కఠిన ఆంక్షల మధ్య భారత్ లాక్డౌన్ అమలు చేసిందని చెప్పారు. అప్పటి నుంచి మౌలిక వసతులను సమకూర్చుకోలేని దేశం కేవలం 14 రోజుల్లో ఎలా సాధిస్తారో ప్రభుత్వం మాకు చెప్పాల్సిన అవసరం ఉంది అని బజాజ్ అన్నారు. తాజా డేటా ప్రకారం, ఒక్కరోజులోనే మహారాష్ట్ర 60,000 కొత్త కేసులను గుర్తిస్తే భారతదేశం అంతటా ఈ సంఖ్య 1.6 లక్షలకు పైగా ఉంది. ఈ నేపథ్యంలోనే మరోమారు మహారాష్ట్రలో లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు వార్తలొస్తున్నాయి. అవసరమైన వారికీ పరీక్షలు నిర్వహించకుండా కంపెనీల్లో పనిచేసే వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలనడం సరైన చర్య కాదని అయన పేర్కొన్నారు. ఇది 'క్లాసిక్ కేస్ ఆఫ్ ఓవర్ రెగ్యులేషన్' అని అన్నారు. భారతదేశ జీడీపీలో మహారాష్ట్ర వాటా దాదాపు 15శాతం ఉంటుంది అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఒకవేల లాక్డౌన్ విధిస్తే ఆ ప్రభావం దేశం మీద పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మరొక లాక్డౌన్ విధించినట్లయితే చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు 'నిజమైన, స్పష్టమైన తక్షణ' మద్దతు ఉండాలని బజాజ్ నొక్కిచెప్పారు. ఎన్నికల సభలు, మతపరమైన మేళాల్లో నిబంధనల ఉల్లంఘన విషయంలో రాజకీయ నేతలు మౌనంగా ఉండటాన్ని, ద్వంద్వ వైఖరిని అవలంభించడాన్ని రాజీవ్ బజాజ్ నిలదీశారు. "కంపెనీల సీఈఓలు ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాము ప్రభుత్వం ముంగిట గొర్రెల్లా నిలబడి తల ఊపబోమని" రాజీవ్ బజాజ్ స్పష్టం చేశారు. చదవండి: బ్యాంకు ఖాతాదారులకి ఆర్బీఐ అలర్ట్! -
జపాన్, సౌత్కోరియాను చూసి నేర్చుకోవాలి: రాజీవ్ బజాజ్
ముంబై: కరోనా నియంత్రణకు ప్రభుత్వ చర్యలు ఫలితాలు ఇవ్వడంలేదని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు పశ్చిమ దేశాల నమూనా అనుసరిస్తుందని విమర్శించారు. కేంద్రం పశ్చిమ దేశాల నమూనా కాకుండా ఆసియా దేశాలైన జపాన్, సౌత్ కోరియా విధానాలను అనుసరించాలని సూచించారు. వైరస్‌ను నియంత్రిస్తునే ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న జపాన్, సౌత్ కోరియాలు విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఆసియా, పశ్చిమ దేశాల రోగనిరోధక వ్యవస్థ విభిన్నంగా ఉంటుందని అన్నారు. 21నుంచి 60సంవత్సరాల వయస్సుల వారిని స్వేచ్చగా కార్యాకలాపాలు నిర్వహించడానికి ప్రభుత్వం అవకాశమివ్వాలని కోరారు. కాగా తమ సంస్థ విజయానికి మూడు సూత్రాలను వివరించారు. ఎఫ్ఐటీ(FIT).. ఇందులో ఎఫ్ అంటే ఫోకస్, ఐ అంటే ఐడియా, టీ అంటే టీమ్ అని తెలిపారు. తమ సంస్థ అంతర్జాతీయ మార్కెట్‌ను నిరంతరం అధ్యయనం చేస్తు విభిన్న మోడళ్లను రూపొందిస్తుందని అన్నారు. మరోవైపు ప్రపంచ మార్కెట్‌ను ఆకర్శించేందుకు సరికొత్త ఐడియాలను అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా సంస్థ విజయాలు సబ్బంది పనితీరుపై ఆధారపడి ఉంటాయని.. మైరుగైన సిబ్బందిని నియమించేందుకు ప్రయత్రిస్తామని తెలిపారు. -
‘వైరస్ కాదు.. ఎకానమీ ధ్వంసం’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా సాగిన సుదీర్ఘ లాక్‌డౌన్‌పై పలు ప్రశ్నలు తలెత్తుతుంటే ప్రభుత్వం వైరస్‌ను నియంత్రించకపోగా జీడీపీని నియంత్రించిందని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న బజాజ్ లాక్డౌన్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని చెప్పారు. లాక్డౌన్ ను కఠినంగా అమలుచేసినా వైరస్ విజృంభణను అడ్డుకోలేకపోగా, ఆర్థిక వ్యవస్ధ చిక్కుల్లో కూరుకుపోయిందని అన్నారు. ప్రభుత్వం ఇన్ఫెక్షన్ చైన్‌ను తెంచలేదని, ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అడ్డుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌పై పోరులో సమతూకంతో వ్యవహరించిన జపాన్ తరహా దేశాలను మనం అనుసరించకుండా అమెరికా, స్పెయిన్, ఇటలీ వంటి పాశ్చాత్య దేశాలను అనుసరించడంతో భంగపడ్డామని రాజీవ్ బజాజ్ విమర్శించారు. లాక్‌డౌన్‌ను చేదు-తీపి అనుభవంగా అభివర్ణించిన బజాజ్ సుదీర్ఘ లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులను భరించగలిగిన వారికి మాత్రమే ఇది అనుకూలంగా ఉందని అన్నారు. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తీపి కన్నా చేదు ఫలితాలే అధికమని చెప్పుకొచ్చారు. వైరస్ పట్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొనేలా ప్రచారం సాగిందని, ఇప్పుడు వారి ఆలోచనా ధోరణి మార్చడం కష్టమని వ్యాఖ్యానించారు. చదవండి: ఉద్యోగులకు రెనాల్ట్ ఇండియా వరాలు -
లాక్డౌన్ ఎత్తేయాలి: రాజీవ్ బజాజ్
ముంబై: కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీ యజయాన్యాలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. భారత్‌లో కరోనా ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయంటూ బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే లాక్డౌన్ ఎత్తివేయాలని తెలిపారు. దేశంలో 20 నుంచి 60 సంవత్సరాల వ్యక్తులను స్వేచ్చగా కార్యకలాపాలు చేసుకునే విధంగా అవకాశమివ్వాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనాను జయించడానికి తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వర్తించాలని ప్రజలను కోరారు. ప్రభుత్వం జీఎస్టీ సరళీకరణ వంటి అనేక పన్నురాయితీలు కేటాయించినా.. కరోనా కారణంగా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను ఎదుర్కొవడానికి ప్రజలు రోగనిరోదకశక్తిని పెంచుకోవాలని సూచించారు. దేశంలో యువ జనాభా, వాతావరణ పరిస్థితులు, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నందున లాక్డౌన్ అవసరం లేదని తెలిపారు. తమ కంపెనీ సామాజిక, ఆర్థిక, భావోద్వేగ పరిస్థితులను తట్టుకుని వ్యాపార వ్యూహాలు రచిస్తుందని పేర్కొన్నారు. -
చేతక్ మళ్లీ వచ్చేసింది!!
న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగి, కనుమరుగైన బజాజ్ చేతక్ స్కూటర్ ఈసారి ఎలక్ట్రిక్ వాహనంగా తిరిగొస్తోంది. బజాజ్ ఆటో బుధవారం చేతక్ ఈ–స్కూటర్‌ను ఆవిష్కరించింది. కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ఆవిష్కరించారు. అమ్మకాలు జనవరి నుంచి మొదలవుతాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. ముందుగా పుణెలో ఆ తర్వాత బెంగళూరులో విక్రయాలు ప్రారంభిస్తామని, స్పందనను బట్టి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. భవిష్యత్‌లో ఉండే అవకాశాలను గుర్తించే.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ముందుగా కాలు మోపుతున్నామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలు, బయో ఇంధనాలు వంటి పర్యావరణ అనుకూల టెక్నాలజీలదేనని గడ్కరీ తెలిపారు. నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 95 కి.మీ. దాకా మైలేజీ.. అధికారికంగా చేతక్ ఈ–స్కూటర్ రేటు ఎంతన్నది వెల్లడించనప్పటికీ, రూ. 1.5 లక్షల లోపే ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీన్ని ఒక్కసారి 5 గంటల పాటు చార్జింగ్ చేస్తే.. ఎకానమీ మోడ్‌లో 95 కి.మీ., స్పోర్ట్స్ మోడ్‌లో 85 కి.మీ. మైలేజీ ఇస్తుందని పేర్కొంది. తమ ప్రొ–బైకింగ్ డీలర్షిప్స్ ద్వారా వీటిని విక్రయించనున్నట్లు రాజీవ్ బజాజ్ చెప్పారు. మహారాష్ట్రలోని చకన్ ప్లాంటులో తయారు చేసే చేతక్ ఈ–స్కూటర్స్‌ను వచ్చే ఏడాది నుంచి యూరప్‌లోని వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. హమారా బజాజ్...: 1970ల తొలినాళ్లలో ప్రవేశపెట్టిన చేతక్ స్కూటర్ దేశీ ద్విచక్ర వాహన రంగంలో ఓ సంచలనం సృష్టించింది. మహాయోధుడు రాణా ప్రతాప్ సింగ్‌కి చెందిన వేగవంతమైన అశ్వం ’చేతక్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్లు.. అప్పట్లోనే కోటి పైగా అమ్ముడయ్యాయి. బుక్ చేసుకుంటే ఏళ్ల తరబడి వెయిటింగ్ లిస్టు ఉండేది. 2005 ప్రాంతంలో స్కూటర్స్ తయారీని బజాజ్ నిలిపివేసి పూర్తిగా మోటార్‌సైకిల్స్‌పై దృష్టిపెట్టింది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌కు సబ్సిడీ.. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికిల్స్ (ఫేమ్) పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై కస్టమర్లు సబ్సిడీ అందుకోవచ్చు. ద్విచక్ర వాహనాలకు అంతకు ముందు మోటార్‌నుబట్టి ఈ సబ్సిడీ నిర్ణయించేవారు. ప్రస్తుతం టెక్నాలజీని బట్టి సబ్సిడీ ఇస్తున్నారు. ఒక కిలోవాట్ అవర్‌కు రూ.10,000 చొప్పున గరిష్టంగా రూ.30,000 వరకు సబ్సిడీ ఉందని అవేరా న్యూ అండ్ రెనివేబుల్ ఎనర్జీ మోటోకార్ప్ టెక్ ఫౌండర్ వెంకట రమణ తెలిపారు. ఉదాహరణకు 3 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల వాహనం ఖరీదు రూ.80,000 ఉందనుకుందాం. వినియోగదారు షోరూంలో రూ.50,000 చెల్లిస్తే చాలు. తయారీదారు ప్రతి 3 నెలలకు డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీకి వాహనాల అమ్మకాల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. మోటారు వాహన చట్టం కింద నమోదయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లకే ఈ సబ్సిడీ లభిస్తుంది. ఇందుకోసం తయారీదారు స్కూటర్ విభాగంలో సంబంధిత ఎలక్ట్రిక్ వాహనానికి ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. గంటకు 25 కిలోమీటర్లపైగా వేగం, 250 వాట్స్ కంటే అధిక సామర్థ్యం ఉన్న మోటార్ ఉంటేనే స్కూటర్‌గా పరిగణిస్తారు. -
వచ్చే ఏడాదే బజాజ్ ‘ఎలక్ట్రిక్’ ఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడెపుడా అని ఎదురు చూస్తున్న వేళ... వచ్చే ఏడాదే ఎలక్ట్రిక్ వాహనాల్లోకి ప్రవేశించనున్నట్టు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ప్రకటించారు. బీఎస్–6 కాలుష్య విడుదల నిబంధనలకు అనుగుణంగా తమ వాహనాల ఇంజన్లను మార్చడంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాల్లోకి ప్రవేశం కూడా వచ్చే ఏడాది ఉంటుందన్నారు. ‘‘ఎలక్ట్రిక్ క్యూట్, ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు (ఆటోలు) తమ ఎజెండాలో ముందున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా మా పెట్రోల్, డీజిల్ ఇంజన్లను రూపొందించనున్నాం’’ అని రాజీవ్ తెలిపారు. కేటీఎంకు చెందిన హస్క్‌వర్న మోటారు సైకిల్ బ్రాండ్‌ను భారత మార్కెట్లోకి ఈ ఏడాదే తీసుకురానున్నట్టు రాజీవ్ బజాజ్ తెలిపారు. బజాజ్ ఆటో తన నాలుగు చక్రాల క్యూట్ (క్వాడ్రిసైకిల్)ను ఇప్పటికే 20 దేశాలకు ఎగుమతి చేస్తున్న విషయం గమనార్హం. మార్చిలో దేశీయ రోడ్లపైకి క్యూట్ భారత్‌లో క్యూట్‌ను ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న ప్రశ్నకు... మార్చిలో జరగొచ్చని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు. తుది అనుమతుల ప్రక్రియలో ఉందన్నారు. బజాజ్ ఈ స్కూటర్..: ఎలక్ట్రిక్ క్యూట్, మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలు తమ అజెండాలో ముందున్నట్టు రాజీవ్ బజాజ్ ప్రకటించారు. అయితే, బజాజ్ నుంచి ఎలక్ట్రిక్ ఈ స్కూటర్ కూడా రానుందని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ‘‘బజాజ్ నుంచి మీరు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అంచనా వేస్తున్నట్టయితే అది ఈ రోజు సాధ్యపడదు. కానీ, త్వరలోనే ఇది జరగనుంది’’ అని రాజీవ్ చెప్పారు. ‘ది వరల్డ్ ఫేవరెట్ ఇండియన్’ దేశీయ సంస్థ బజాజ్ ఆటో 17 ఏళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో సాధించిన పురోగతిపై ‘ద వరల్డ్ ఫేవరెట్ ఇండియన్’ పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాజీవ్ బజాజ్ సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ద్విచక్రవాహన ఎగుమతుల్లో బజాజ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, సంస్థ ఆదాయంలో 40% విదేశీ మార్కెట్ల నుంచే వస్తున్నట్టు చెప్పారు. 70 దేశాల్లో 15 మిలియన్ల వాహనాల అమ్మకాలతో కేంద్ర ప్రభుత్వ ఆకాంక్ష అయిన ‘మేకిన్ ఇండియా’కు చిరునామాగా బజాజ్ నిలిచిందని రాజీవ్ వివరించారు. గత పదేళ్లలో సంస్థ 13 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ పాల్గొన్నారు. -
అదో టైమ్ వేస్ట్ కార్యక్రమం
న్యూఢిల్లీ: వార్షిక బడ్జెట్ రూపకల్పనా ప్రక్రియ ప్రారంభమవుతోందంటే... పారిశ్రామికవేత్తలు వారి కోర్కెలు ప్రభుత్వానికి తెలియజేయడానికి, వాటికి బడ్జెట్లో స్థానం కల్పించేలా చూడ్డానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంటారు. ఇక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి పార్లమెంటులో ప్రవేశపెడుతున్న సందర్భంలో ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా చూడ్డం, ఆయా ప్రతిపాదనలపై వ్యాఖ్యలు చేయడం, తమ అభిప్రాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం వంటి అంశాల్లో ఆయా వర్గాల హడావుడి అంతా ఇంతా కాదు. అయితే దీనిపై బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి సమర్పించడానికి తన వద్ద ‘విష్‌లిస్ట్’ ఏదీ లేదన్నారు. అసలు బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు టీవీల్లో ఈ కార్యక్రమాన్ని చూడ్డమే దండుగ అన్నారు. అదో టైమ్ వేస్ట్ వ్యవహారమని వ్యాఖ్యానించారు. ‘4 గంటల పాటు బడ్జెట్ ప్రసంగం చూసి, బుర్రపై భారం వేసుకునే బదులు, ఆ సమయాన్ని ఏదైనా ఉత్పాదక అంశంపై సద్వినియోగం చేసుకుంటే మంచిది. ద్విచక్ర వాహనాలను లగ్జరీ ఐటమ్‌గా పరిగణించి 28% జీఎస్టీ విధించడం తగదు. 18% పరిధిలో ఉండాలి’ అని అన్నారు. -
2020లో ఎలక్ట్రిక్ వాహనాల్లోకి బజాజ్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో 2020 నాటికి ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లోకి ప్రవేశించనుందని ఆ సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. ఈ విభాగం ఆకర్షణీయమైనదిగా చెప్పారాయన. వచ్చే 12 నెలల కాలంలో మార్కెట్ వాటాను 15– 20 శాతం స్థాయి నుంచి 20–25 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. ‘‘రెండేళ్ల కాలంలోనే 10 శాతం మార్కెట్ వాటాను సాధించడం మామూలు విషయం కాదు. ఇది 35 ఏళ్లుగా భారత్‌లో ఉన్న యమహా మార్కెట్ వాటాతో పోలిస్తే మూడు రెట్లు’’ అని రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా వచ్చే కొన్ని నెలల పాటు సమస్యలుంటాయా? అన్న ప్రశ్నకు... ఆసక్తికరమైన ధోరణులతో ఉత్సాహంగా ఉన్నట్టు ఆయన బదులిచ్చారు. ఎగుమతులకు సంబంధించి మార్కెట్లలో అనిశ్చితి నెలకొందని, అయినా 2018 చివరికి కంపెనీ 20 లక్షల యూనిట్లను 70 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు చెప్పారాయన. -
డిస్కవర్ 100 సీసీ ఘోర తప్పిదం..
ముంబై: మోటార్‌సైకిల్ శ్రేణి డిస్కవర్లో 100 సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టడం తన కెరియర్లో ఘోర తప్పిదమని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. దీనితో తమ సంస్థ దేశీ ద్విచక్రవాహనాల మార్కెట్లో నంబర్– 2 స్థానానికి పరిమితమైపోయిందని చెప్పారాయన. ఒకవేళ 100 సీసీని ప్రవేశపెట్టకుండా ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవన్నారు. ‘‘డిస్కవర్లో 125సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఇటు మైలేజీతో పాటు అటు అధిక సామర్థ్యంతో పనిచేసే బైక్‌గా ప్రత్యేకత ఉండేది. గణనీయంగా పెరిగిన అమ్మకాలే ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత అత్యాశకు పోయాం. 125 సీసీ డిస్కవర్ బైకులు ఇంత భారీగా అమ్ముడవుతున్నాయంటే.. ఇక 100 సీసీ బైక్‌లు ఇంకా భారీగా అమ్ముడవుతాయంటూ మా మార్కెటింగ్ సిబ్బంది అభిప్రాయపడ్డారు. దీంతో 100 సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టాం. అంతే... మా ప్రత్యేకత పోయింది. అయిదేళ్ల తర్వాత మా పనితీరు కూడా దెబ్బతింది. విభిన్నంగా ఉండాలనే ప్రయత్నంతో డిస్కవర్ 125 సీసీని తీసుకొచ్చాం. కానీ ఆ తర్వాత మూసధోరణిలోకి పోయాం. ఈ మూసధోరణి అనేది జీవితంలోనైనా, మార్కెటింగ్లోనైనా చాలా చెడ్డది‘ అని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. అప్పుడెప్పుడో చేసిన తప్పిదానికి తమ కంపెనీ ఇప్పటికీ రెండో స్థానానికే (బైక్‌ల అమ్మకాల పరిమాణం పరంగా) పరిమితమైపోవాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ఆశావహంగా కేటీఎం.. తాము ఇన్వెస్ట్ చేసిన ఆస్ట్రియన్ రేసింగ్ బైక్‌ల తయారీ సంస్థ కేటీఎం అవకాశాలు ఆశావహంగా ఉన్నాయని రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. 2007లో తాము ఇన్వెస్ట్ చేసినప్పుడు కేటీఎం ఏటా 65,000 బైక్‌లు మాత్రమే తయారు చేసేదని, అయినప్పటికీ యూరప్‌లో రెండో అతి పెద్ద మోటార్ సైకిల్ బ్రాండ్‌గా ఉండేదని ఆయన తెలియజేశారు. ‘‘అప్పట్లో మరో దిగ్గజ సంస్థ హార్లే డేవిడ్సన్ ఏడాదికి 3.5 లక్షల బైకులు తయారు చేసేది. అయితే, గత కొన్నాళ్లుగా హార్లే ప్రభావం క్రమంగా తగ్గుతోంది. ఈ ఏడాది 2.4 లక్షల వాహనాలే తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. కేటీఎం మాత్రం అంతకు మించి 2.7 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయనుంది’’ అని ఆయన వివరించారు. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించనున్నట్లు రాజీవ్ బజాజ్ చెప్పారు. -
తెలివైన పెట్టుబడులు పెట్టాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని రంగాల్లో పురోగమిస్తున్న మహిళలు.. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని బజాజ్ క్యాపిటల్ ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ.. మహిళా ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మహిళలు– సంపద’ అంశంపై పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ జరిగిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా రాజీవ్ ఈ విషయాలు చెప్పారు. పెట్టుబడుల విషయంలో వివేకవంతంగా వ్యవహరించాలని మహిళలకు సూచించారు. మరోవైపు, ఎకానమీ మొదలైన వాటి పరిస్థితులు ఎలా ఉన్నా... స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకుని, క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించాలని కటింగ్ ఎడ్జ్ వ్యవస్థాపకుడు గౌరవ్ మష్రువాలా సూచించారు. ఎఫ్ఎల్వో హైదరాబాద్ చైర్పర్సన్ కామిని సరాఫ్, వైజ్ ఇన్వెస్ట్ అడ్వైజర్స్ సీఈవో హేమంత్ రస్తోగి, కరమ్‌యోగ్ నాలెడ్జ్ అకాడెమీ వ్యవస్థాపకుడు అమిత్ త్రివేది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు, వచ్చే రెండేళ్లలో బజాజ్ క్యాపిటల్ సంస్థ రుణ కార్యకలాపాల విభాగంలోకి కూడా ప్రవేశించనున్నట్లు రాజీవ్ వెల్లడించారు. ప్రస్తుతం తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.20,000 కోట్లుగా ఉండగా.. అయిదేళ్లలో ఇది రూ. లక్ష కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. -
బజాజ్ నుంచి 500 సీసీ బైక్..
న్యూఢిల్లీ: పల్సర్, అవేంజర్‌లతో టూవీలర్ మార్కెట్లో దూసుకుపోతున్న బజాజ్ కంపెనీ.. త్వరలో 500సీసీ స్పోర్ట్స్ బైక్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మధ్యనే న్యూడోమినర్ -400 పేరుతో ఓ బైక్‌ను విడుదల చేసిన బజాజ్ కంపెనీ తాజాగా 500 సీసీ బైక్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఇది కూడా డోమినర్ రేంజ్ ధర రూ.1 లక్ష - 2 లక్షల్లోనే అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ.. డోమినర్ రేంజ్లో మరిన్ని బైక్‌లను విడుదల చేస్తామని, దీనికి సంబంధించిన ప్రణాళికలున్నాయన్నారు. మరో రెండు, మూడు నెలల్లో బజాజ్ నుంచి మంచి ప్రకటన వింటారని.. అది డోమినర్ బ్రాండ్.. కేటీఎం బ్రాండ్.. లేదా ఏదైనా కొత్త బ్రాండ్ కావచ్చని రాజీవ్ తెలిపారు.. పల్సర్, అవేంజర్లను మరిన్ని సరికొత్త రేంజ్‌లతో మార్కెట్లోకి తెస్తామని, ఇవి ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ పొందిన బ్రాండ్లన్నారు. బజాజ్ కంపెనీకి ఎంతో ముఖ్యమైన బ్రాండ్లని రాజీవ్ పేర్కొన్నారు. ఈ బ్రాండ్లు కంపెనీ అమ్మకాలు పెంచాయన్నారు. నోట్ల రద్దు ప్రభావంతో గతేడాది అమ్మకాలు తగ్గిన ఫిబ్రవరిలో స్పల్పంగా పెరిగాయని తెలిపారు. ఎస్ఐఏఎం లెక్కల ప్రకారం గత నెల వరకు భారత్‌లో 8,32,697 టూవీలర్ అమ్మకాలు జరిగాయని అంతకు ముందు నెల అమ్మకాలు 8,59,582 గా ఉన్నాయని తెలిపారు. నెల వ్యవధిలో అమ్మకాలు 3.13 శాతం మేర తగ్గయన్నారు. బజాజ్ ప్రభావంతో హీరో కంపేనీ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 29.97 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు. -
అప్పుడు.. మ్యాడ్ ఇన్ ఇండియా అవుతుంది!
కొత్త ఆవిష్కరణలకు అడ్డంకులు సృష్టిస్తే ఎలా • అయిదేళ్లుగా క్వాడ్రిసైకిల్‌కి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం • బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ముంబై: వినూత్నంగా ఆవిష్కరించిన తమ క్వాడ్రిసైకిల్‌కు అనుమతుల కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ తాజాగా ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఓవైపు భారత్‌లో తయారు చేయండని పిలుపునిస్తూ.. మరోవైపు నియంత్రణ ఏజెన్సీలు దేశీయంగా తయారయ్యే కొత్త ఆవిష్కరణల గొంతు నొక్కేస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీనివల్ల మేడిన్ ఇండియా నినాదం కాస్తా మ్యాడ్ (పిచ్చితనం) ఇన్ ఇండియాగా మారిపోయే ప్రమాదం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తమ కంపెనీ రూపొందించిన క్వాడ్రిసైకిల్ ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘దేశీయంగా తయారు చేసే ఏ కొత్త ఆవిష్కరణ భవితవ్యం అయినా.. ప్రభుత్వ అనుమతులపైనో.. న్యాయపరమైన ప్రక్రియలపైనో ఆధారపడి ఉంటే మేడ్ ఇన్ ఇండియా నినాదం కాస్తా.. మ్యాడ్ ఇన్ ఇండియాగా మారిపోయే ప్రమా దం ఉంది. మేం ఫోర్ వీలర్‌ను రూపొందించి అయిదేళ్లవుతోంది. దాన్ని ఇక్కడ అమ్మడానికి అనుమతుల కోసం అయిదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాం’ అని బజాజ్ పేర్కొన్నారు. ఇంధనం ఆదా చేసేవిగాను, సురక్షితమైనవిగాను యూరప్, ఆసియా, లాటిన్ అమెరికాల్లోని దేశాల్లో అమ్ముడవుతున్న క్వాడ్రి–సైకిల్‌ను భారత్‌లో విక్రయించడానికి మాత్రం అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. తమ సంస్థ కార్లకు వ్యతిరేకమని బజాజ్ మరోసారి స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలు ప్రమాదకరమైనవనేది అపోహేనని, నిర్లక్ష్య డ్రైవింగే టూవీలర్ ప్రమాదాలకు కారణమవుతున్నదని చెప్పారు. మళ్లీ స్కూటర్ల యోచన లేదు .. కంపెనీ మళ్లీ స్కూటర్ల తయారీలోకి ప్రవేశించాలన్న సూచనలను బజాజ్ తోసిపుచ్చారు. దీనివల్ల అంతర్జాతీయంగా మోటార్‌సైకిల్ అమ్మకాల్లోని 10% వాటాను మరింతగా పెంచుకోవాలన్న తమ లక్ష్యం పక్కదారి పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘టూ వీలర్ ఏదైనా టూ వీలరే అనుకుంటారు. మోటార్ సైకిల్ తయారు చేస్తున్నప్పుడు స్కూటర్లు కూడా తయారు చేయొచ్చుగా అంటారు. ఇది.. ఎలాగూ బ్యాట్, బాల్తోనే కదా ఆడేది అలాంటప్పుడు బేస్‌బాల్ ఆడొచ్చుగా అని సచిన్ టెండూల్కర్‌కి చెప్పినట్లుగా ఉంటుంది’ అని బజాజ్ అన్నారు. మోటార్‌సైకిల్ మార్కెట్లో మరికాస్త ఎక్కువ వాటా దక్కించుకోవడానికి ప్రయత్నించడం సబబుగా ఉంటుంది కానీ.. అసలు వాటాయే లేని స్కూటర్ల మార్కెట్లో కొత్తగా ప్రవేశించడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. గడువుకు ముందే ‘బీఎస్–4’ అమలు... 2017 జనవరి నుంచి తమ కంపెనీలో తయారవుతోన్న వాహనాలన్నీ బీఎస్–4 నిబంధనలకు అనువుగా ఉన్నాయని బజాజ్ తెలిపారు. బజాజ్ ఆటో పేర్కొంది. నిర్దేశిత గడువు(2017, ఏప్రిల్)కు ముందుగానే బీఎస్–4 అమలుకు సిద్ధంగా ఉన్న తొలి కంపెనీగా తాము అవతరించామని చెప్పారు. -
బజాజ్ ఆటో నుంచి క్వాడ్రిసైకిల్
న్యూఢిల్లీ : బజాజ్ ఆటో కంపెనీ ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్(నాలుగు కార్ల వాహనం)ను శుక్రవారం ఆవిష్కరించింది. క్యూట్ పేరుతో అందిస్తున్న ఈ వాహనం ధర 2,000 డాలర్లని(సుమారుగా రూ.1.35 లక్షలు) బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. సుప్రీం కోర్టులో ఈ వాహనంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణలో ఉన్నందున వీటిని భారత్‌లో విక్రయిచండం లేదని, విదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. వాటర్ కూల్డ్ డీటీఎస్ఐ, ఫోర్ వాల్వ్ 217 సీసీ ఇంజిన్, మైలీజీ 36 కిమీపర్ లీటర్ అని, గరిష్ట వేగం గంటకు 70 కిమీ. అని రాజీవ్ బజాజ్ వివరించారు. -
మార్కెట్లోకి సింగర్ కూలర్లు
హైదరాబాద్: సింగర్ ఇండియా లిమిటెడ్ సంస్థ సరికొత్త డిజైన్లతో కూలర్లను విడుదల చేసింది. శనివారమిక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ వీటిని మార్కెట్లోకి విడుదల చేశారు. ఆరు వేరియంట్లను విడుదల చేసిన అనంతరం... డిజైన్లలో నాణ్యత, మన్నికకు పెద్దపీట వేశామని, తమ సంస్థ నుంచి వచ్చిన ఇతర ఉత్పాదనల్లానే వీటిని కూడా వినియోగదారులు ఆదరిస్తారని భావిస్తున్నట్లుగా రాజీవ్ బజాజ్ చెప్పారు. ‘‘వీటి ధరలు రూ.6 వేల నుంచి రూ.12 వేల మధ్య ఉన్నాయి. అన్ని వర్గాలనూ దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించాం’’ అన్నారాయన. ఈ కూలర్లతోపాటు 45 రకాల గృహోపకరణాలను కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో సంస్థ సీఎఫ్‌వో సుభాష్ నాగ్‌పాల్, అప్లియెన్సెస్ హెడ్ సుశీల్ మిశ్రా, రీజినల్ మేనేజర్ మనురాజ్, బ్రాంచ్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మహీంద్రా ధరలూ పెరిగాయ్
న్యూఢిల్లీ: రూపాయి క్షీణతతో ధరల భారాన్ని వాహన కంపెనీలు వినియోగదారుని నెత్తిన వేయాలని నిర్ణయించాయి. రూపాయి పతనానికి తోడు ముడిసరుకుల ధరలు కూడా పెరిగి ఉత్పత్తి వ్యయాలు అధికం కావడంతో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, పలు వాహన కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా, ధరలను పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నామని బజాజ్ ఆటో పేర్కొంది. మహీంద్రా కంపెనీ ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ధరలను రూ.6,000 నుంచి రూ.20,000 వరకూ పెంచుతోంది. ఈ పెంచిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు. ఈ కంపెనీ స్కార్పియో, ఎక్స్‌యూవీ 500, బొలెరో, వెరిటోతో పాటు పలు రకాల వాహనాలను తయారు చేస్తోంది. త్వరలోనే పెంపు: రూపాయి విలువ క్షీణించడంతో ఉత్పత్తి వ్యయం పెరగిందని... ధరలు పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. ఇప్పటికే మారుతీ, హ్యుందాయ్, జీఎం, టయోటా, మెర్సిడెస్ బెంజ్, ఆడి తదితర కంపెనీలు ధరలను పెంచగా, ధరల పెంపు విషయమై తీవ్రం గానే పరిశీలిస్తున్నామని టాటా మోటార్స్ పేర్కొంది.