మార్కెట్లోకి సింగర్ కూలర్లు
హైదరాబాద్: సింగర్ ఇండియా లిమిటెడ్ సంస్థ సరికొత్త డిజైన్లతో కూలర్లను విడుదల చేసింది. శనివారమిక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ వీటిని మార్కెట్లోకి విడుదల చేశారు. ఆరు వేరియంట్లను విడుదల చేసిన అనంతరం... డిజైన్లలో నాణ్యత, మన్నికకు పెద్దపీట వేశామని, తమ సంస్థ నుంచి వచ్చిన ఇతర ఉత్పాదనల్లానే వీటిని కూడా వినియోగదారులు ఆదరిస్తారని భావిస్తున్నట్లుగా రాజీవ్ బజాజ్ చెప్పారు. ‘‘వీటి ధరలు రూ.6 వేల నుంచి రూ.12 వేల మధ్య ఉన్నాయి. అన్ని వర్గాలనూ దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించాం’’ అన్నారాయన. ఈ కూలర్లతోపాటు 45 రకాల గృహోపకరణాలను కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో సంస్థ సీఎఫ్‌వో సుభాష్ నాగ్‌పాల్, అప్లియెన్సెస్ హెడ్ సుశీల్ మిశ్రా, రీజినల్ మేనేజర్ మనురాజ్, బ్రాంచ్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.