బజాజ్ నుంచి 500 సీసీ బైక్..
బజాజ్ నుంచి 500 సీసీ బైక్..
Published Fri, Mar 17 2017 10:36 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
న్యూఢిల్లీ: పల్సర్, అవేంజర్‌లతో టూవీలర్ మార్కెట్లో దూసుకుపోతున్న బజాజ్ కంపెనీ.. త్వరలో 500సీసీ స్పోర్ట్స్ బైక్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మధ్యనే న్యూడోమినర్ -400 పేరుతో ఓ బైక్‌ను విడుదల చేసిన బజాజ్ కంపెనీ తాజాగా 500 సీసీ బైక్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఇది కూడా డోమినర్ రేంజ్ ధర రూ.1 లక్ష - 2 లక్షల్లోనే అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ.. డోమినర్ రేంజ్‌లో మరిన్ని బైక్‌లను విడుదల చేస్తామని, దీనికి సంబంధించిన ప్రణాళికలున్నాయన్నారు. మరో రెండు, మూడు నెలల్లో బజాజ్ నుంచి మంచి ప్రకటన వింటారని.. అది డోమినర్ బ్రాండ్.. కేటీఎం బ్రాండ్.. లేదా ఏదైనా కొత్త బ్రాండ్ కావచ్చని రాజీవ్ తెలిపారు..
పల్సర్, అవేంజర్‌లను మరిన్ని సరికొత్త రేంజ్‌లతో మార్కెట్లోకి తెస్తామని, ఇవి ఇప్పటికే మార్కెట్‌లో మంచి ఆదరణ పొందిన బ్రాండ్‌లన్నారు. బజాజ్ కంపెనీకి ఎంతో ముఖ్యమైన బ్రాండ్‌లని రాజీవ్ పేర్కొన్నారు. ఈ బ్రాండ్‌లు కంపెనీ అమ్మకాలు పెంచాయన్నారు. నోట్ల రద్దు ప్రభావంతో గతేడాది అమ్మకాలు తగ్గిన ఫిబ్రవరిలో స్పల్పంగా పెరిగాయని తెలిపారు. ఎస్‌ఐఏఎం లెక్కల ప్రకారం గత నెల వరకు భారత్‌లో 8,32,697 టూవీలర్ అమ్మకాలు జరిగాయని అంతకు ముందు నెల అమ్మకాలు 8,59,582 గా ఉన్నాయని తెలిపారు. నెల వ్యవధిలో అమ్మకాలు 3.13 శాతం మేర తగ్గయన్నారు. బజాజ్ ప్రభావంతో హీరో కంపేనీ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 29.97 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement