ముంబై: కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీ యజయాన్యాలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. భారత్‌లో కరోనా ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయంటూ బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే లాక్‌డౌన్ ఎత్తివేయాలని తెలిపారు. దేశంలో 20 నుంచి 60 సంవత్సరాల వ్యక్తులను స్వేచ్చగా కార్యకలాపాలు చేసుకునే విధంగా అవకాశమివ్వాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనాను జయించడానికి తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వర్తించాలని ప్రజలను కోరారు.
ప్రభుత్వం జీఎస్‌టీ సరళీకరణ వంటి అనేక పన్నురాయితీలు కేటాయించినా.. కరోనా కారణంగా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను ఎదుర్కొవడానికి ప్రజలు రోగనిరోదకశక్తిని పెంచుకోవాలని సూచించారు. దేశంలో యువ జనాభా, వాతావరణ పరిస్థితులు, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నందున లాక్‌డౌన్ అవసరం లేదని తెలిపారు. తమ కంపెనీ సామాజిక, ఆర్థిక, భావోద్వేగ పరిస్థితులను తట్టుకుని వ్యాపార వ్యూహాలు రచిస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment