
కొన్ని సార్లు కొందరు వ్యక్తులు చేసే పనులు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. అలాంటిదే అమెరికాలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఎలక్ట్రిక్ కారులో పెట్రోల్ నింపడానికి చేసిన ప్రయత్నం నవ్వు తెప్పించే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను గమనిస్తే.. యూఎస్‌లోని ఓ ఫిల్లింగ్ స్టేషన్ వద్దకు ఎలక్ట్రిక్ కారులో వచ్చిన మహిళ అందులో పెట్రోల్ నింపేందుకు చాలా విధాలుగా ప్రయత్నించారు. అది ఎలక్ట్రిక్ కారు అనే విషయం మార్చిపోయారో/తెలియకనో గాని అందులో పెట్రోల్ కొట్టడానికి శత విధాల ట్రై చేశారు.
పెట్రోల్ ట్యాంక్ ద్వారం కోసం కారు చుట్టూరా వెతికారు. చివరకు కారు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూశారు. దీనిని చూస్తున్న అక్కడివారు తెగ నవ్వుకున్నారు. దాదాపు రెండు నిమిషాలకు పైగా ఆమె కారులో పెట్రోల్ నింపేందుకు ప్రయత్నించారు. చివరకు ఓ వ్యక్తి ఆమె వద్దకి వచ్చి అది పెట్రోల్ కారు కాదని.. ఎలక్ట్రిక్ కారు అని చెప్పారు. దీంతో అసలు విషయాన్ని గ్రహించిన ఆమె నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా ఆమె వెనుకల కారులో కూర్చుని ఉన్నవారు వీడియో తీశారు. తర్వాత దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment