
న్యూఢిల్లీ: వాహన వినియోగదారులకు మరోసారి ఊరట. ఆదివారం లీటరు పెట్రోలుపై 40 పైసలు, లీటరు డీజిల్‌పై 33 పైసలు తగ్గిస్తూ ఇంధన కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రో ధరలు తగ్గింపుతో ఢిల్లీలో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ.80.05 కాగా, లీటర్ డీజిల్ రూ.74.05గా ఉంది. వరుసగా 11వరోజు ఇంధన ధరలు తగ్గడంతో ఇప్పటివరకూ లీటర్ పెట్రోల్‌పై రూ.2.78, లీటర్ డీజిల్‌పై రూ.1.64 పైసలు ఇంధన సంస్థలు తగ్గించినట్లైంది. ఈ నెల 18 నుంచి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుండటంతో దేశంలో ఇంధన సంస్థలు కూడా ఆమేరకు ధరలు తగ్గించాయి.
Comments
Please login to add a commentAdd a comment