హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకుందని వరంగల్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సి.రాజయ్య స్పష్టం చేశారు. కానీ ఎన్నికల హామీలు అమలు చేయకుండా టీఆర్ఎస్ మాట తప్పిందని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బీఫాం అందుకున్న తర్వాత రాజయ్య మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో ఒకే దఫాలో రుణమాఫీ జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం వాయిదాల పర్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. లోక్ సభ అభ్యర్థిగా రాజయ్య సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.