సైకో అన్నందుకు కడియం క్షమాపణ చెప్పాలి | ponguleti sudhakar reddy takes on kadiyam srihari | Sakshi
Sakshi News home page

సైకో అన్నందుకు కడియం క్షమాపణ చెప్పాలి

Published Sat, Nov 7 2015 12:37 PM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

సైకో అన్నందుకు కడియం క్షమాపణ చెప్పాలి

సైకో అన్నందుకు కడియం క్షమాపణ చెప్పాలి

హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై రైతు చెప్పు విసరడం.. టీఆర్ఎస్పై రైతుల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. రైతును సైకో అన్నందుకు క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరిని ఈ సందర్భంగా పొంగులేటి శనివారం హైదరాబాద్ లో డిమాండ్ చేశారు.

వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచార సభలో మాట్లాడుతున్న తెలంగాణ డిప్యూటి ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై ఓ రైతు చెప్పు విసిరి... మీ పాలనలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. దీంతో అతడిని టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో రైతును సైకో అని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో  కడియం వ్యాఖ్యలపై పొంగులేటి మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement