
'16 నుంచి వరంగల్ లో వైఎస్ జగన్ ప్రచారం'
వరంగల్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని తెలంగాణలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైఎస్ జగన్ ఈ ఎన్నికల ప్రచారం చేస్తారని చెప్పారు.
శుక్రవారం విలేకర్ల సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ...లోక్సభ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ, స్టేషన్ ఘన్పూర్, తొర్రూర్, పరకాల బహిరంగ సభల్లో వైఎస్ జగన్ పాల్గొంటారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తో పాటు పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, శివకుమార్, మహేందర్రెడ్డి పాల్గొన్నారు.