ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మంగళవారం కరీంనగర్ లో నిప్పులు చెరిగారు.
కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మంగళవారం కరీంనగర్ లో నిప్పులు చెరిగారు. కేసీఆర్ అసమర్ధత వల్లే రాష్ట్రం అప్పులపాలైందని ఎల్ రమణ ఆరోపించారు. కరీంనగర్లో ఎల్ రమణ విలేకర్లతో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే... కేసీఆర్ మాత్రం ఫాంహౌస్లో నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్ ఉప ఎన్నికలో టీడీపీ - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దేవయ్యను గెలిపించుకుంటామని ఎల్ రమణ స్పష్టం చేశారు.