సాక్షి,గన్‌ఫౌండ్రీ/హైదరాబాద్/సనత్‌నగర్: చేనేత కళాకారుల పట్ల కేంద్రం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ ఎల్.రమణ మండిపడ్డారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధిస్తున్న 5శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేత కళాకారులు రాసిన లక్షలాది ఉత్తరాలతో నిజాం కళాశాల మైదానం నుంచి అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ... చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేసి నేత కార్మికుల జీవితబీమా, సబ్సిడీ, హ్యాండ్లూమ్, పవర్ లూమ్ బోర్డు వంటి సంక్షేమ కార్యక్రమాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేసే వరకు పోరు కొనసాగిస్తామన్నారు.
పోస్ట్‌కార్డులతో నిరసన తెలుపుతున్నఎల్.రమణ తదితరులు
తెలంగాణ వచ్చాకే చేనేతకు పూర్వవైభవం సంక్షోభంలో ఉన్న చేనేత రంగానికి తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పూర్వ వైభవం తెచ్చా రని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లో తనను కలిసిన చేనేత సంఘం ప్రతినిధులతో ఆయన చర్చించారు. చేనేతపై కేంద్రం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి పోస్ట్‌కార్డు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment