TTDP President
-
'కేసీఆర్ ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారు'
కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మంగళవారం కరీంనగర్ లో నిప్పులు చెరిగారు. కేసీఆర్ అసమర్ధత వల్లే రాష్ట్రం అప్పులపాలైందని ఎల్ రమణ ఆరోపించారు. కరీంనగర్లో ఎల్ రమణ విలేకర్లతో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే... కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్ ఉప ఎన్నికలో టీడీపీ - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దేవయ్యను గెలిపించుకుంటామని ఎల్ రమణ స్పష్టం చేశారు. -
ప్రొ.కోదండరామ్‌తో టీటీడీపీ అధ్యక్షుడు భేటీ
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ .రమణ మంగళవారం ఉదయం ప్రొ. కోదండరామ్ నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై... తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఎల్ రమణ.. ప్రొ.కోదండరామ్ ని కోరినట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహారిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలంటూ ఇటీవల అసెంబ్లీలో డిమాండ్ చేసిన ప్రతిపక్షా పార్టీల సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం విదితమే. అలాగే ఒకే దఫా రుణమాఫీ చేయాలంటూ తెలంగాణ బంద్‌కు ప్రతిపక్షాలు పిలుపు నిచ్చాయి. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడిపింది. దీంతో బంద్ అంతాగా విజయం సాధించలేకపోయింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొ.కోదండరామ్ మద్దతు తీసుకుని... టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీటీడీపీ భావిస్తుంది. ఆ క్రమంలో ప్రొ. కోదండరామ్‌ను మద్దతు కోరేందుకు ఎల్ రమణ భేటీ అయ్యారు. -
నిర్ణయం తీసుకుంటే రేపు రాష్ట్ర బంద్
హైదరాబాద్: ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం నిర్ణయం తీసుకుంటే రేపు రాష్ట్ర బంద్ ఉంటుందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. అలా నిర్ణయం తీసుకోకుంటే టీడీపీ, బీజేపీ కలిసి గజ్వేల్‌లో ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. -
'ఏడాదైనా పాలన గాడిలో పడలేదు'
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎమ్మెల్యే వివేక్ బుధవారమిక్కడ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా పాలన గాడిలో పడలేదని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు దృష్టి పెట్టకపోవడంతోనే సమ్మెలు, ఉద్యమాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఉపాధి హామీ, మున్సిపల్, రెవిన్యూతోపాటు అన్ని శాఖ ఉద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. ఉద్యమ న్యాయకుడిగా అధికారులు, పాలకుల ఇళ్ల ముందు చెత్తవేయాలని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కేసీఆర్ చెప్పిన ఈ మాటలను ప్రస్తుతం మున్సిపల్ ఉద్యోగులు మళ్లీ ఆయనకే అప్పచెబుతున్నారన్నారు. వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ప్రజల సమస్యలు తీర్చాలని ఎల్.రమణ, వివేక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సోమేష్ కుమార్ అదికార పార్టీ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఎల్ రమణ, వివేక్ ఆరోపించారు.