పరకాల : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌తోపాటు కుమారుడు, కూతురు, అల్లుడు కలిసి నాలుగు స్తంభాలాటగా పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి దేవయ్య తరఫున ప్రచారంలో భాగంగా మంగళవారం పరకాలలో రోడ్‌షో నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందన్నారు.
కాంగ్రెస్‌కు ఓటు అడిగే అర్హత లేదన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టబెట్టేందుకే నియోజకవర్గానికి 400 ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరూ అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వరంగల్ జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. దేవయ్యను గెలిపిస్తే వరంగల్ మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
కార్యక్రమంలో డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, గుజ్జు ల ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణరావు, రత్న శైలేందర్, మేకల రాజవీరు, ఆర్‌పీ జయంత్‌లాల్, మేఘనాథ్, నాగెల్లి రంజి త్, ముస్కే సంతోష్, సమ్మయ్య, వెనిశెట్టి రాజేష్, నరేష్, రాజేందర్ పాల్గొన్నారు.