ఆత్మకూర్: వరంగల్ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా జిల్లాలోని ఆత్మకూర్‌లో ఓ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పోలింగ్ కేంద్రంలో వెళ్లటంతో స్థానిక కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని, లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే ధర్మారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవటంతో కాంగ్రెస్ వర్గీయులు కూడా పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.