
'టీఆర్ఎస్ పతనం స్పష్టంగా కనబడుతోంది'
వరంగల్ : ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాళ్లతో కొట్టమని ... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం వరంగల్లో ఉప ఎన్నిక ప్రచారంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... టీఆర్ఎస్ పతనం స్పష్టంగా కనడబడుతోందన్నారు.
కేసీఆర్.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో ఫామ్హౌజ్లో కూర్చుని జరిపిన చర్చల్లో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటో ప్రజలకు వివరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.