
మోదీకి తెలంగాణకొచ్చే తీరిక లేదట!
నయీంనగర్ : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తీరిక లేదని ఐటీశాఖ మంత్రి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కేటీఆర్ అన్నారు. విదేశాలకు వెళ్లి వచ్చేందుకు మాత్రం ఆయనకు పుష్కల మైన సమయం దొరుకుతోందన్నారు. మంగళవారం హన్మకొండ నయీంనగర్‌లోని కందకట్ల గేట్ వే కాంప్లెక్స్‌లో ఆచార్య జయశంకర్ స్మారక సేవా సమితి, విద్యారణ్యపురి కాలనీ జేఏసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉప ఎన్నిక సన్నాహక సమావేశానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం వరంగల్ పశ్చి మ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ మాట్లాడారు.
సేవా సమితి నాయకులు డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. శ్రీనగర్ కాలనీ, సరస్వతీ నగర్ కాలనీ, ప్రేమ్‌నగర్ కాలనీ కమిటీలు పార్టీ అభ్యర్థి పసునూరి దయూకర్ గెలుపునకు కృషిచేస్తామని కేటీఆర్‌కు హామీ ఇచ్చారుు. మాజీ డిప్యూటీ మేయర్ టి.అశోకరావు, టీఎన్జీవోస్ నాయకుడు కావటి సమ్మయ్య, టీజీఏ నాయకులు మర్రి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు రాజన్, పమ్మి రమేష్, రుద్రోజు సంపత్, పర్యావరణవేత్త రతన్‌సింగ్, డాక్టర్ వెంకటి, యాదగిరి పాల్గొన్నారు.