'నేతలు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టం లేదు' | Digvijay singh attended in tpcc executive committee | Sakshi
Sakshi News home page

'నేతలు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టం లేదు'

Published Tue, May 17 2016 5:33 PM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

Digvijay singh attended in tpcc executive committee

హైదరాబాద్ : తమ పార్టీలోని నేతలు మరో పార్టీలోకి వెళ్లినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. కొత్త నాయకత్వంతో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. మంగళవారం గాంధీభవన్లో ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతను టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే ఈ సమావేశంలోల పాల్గొన్న మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ...  పీసీసీ రెండు కమిటీల్లో తనకు అవకాశం ఇచ్చారని ఆయన చెప్పారు. అయితే తాను సమన్వయ కమిటీ సభ్యుడిగానే కొనసాగుతానని వివేక్ స్పష్టం చేశారు. పీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ వివేక్ ఈ సందర్భంగా ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement