సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో కలిసి ఆయన అమిత్ షా వద్దకు వెళ్లారు. వివేక్ వెంట వెళ్లిన ఆయన కుమారుడు కూడా అమిత్ షాను కలిశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆయన అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని కోరారు. కాగా, గత కొంత కాలంగా వివేక్ బీజేపీలో చేరనున్నారనే వార్తలు ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా బీజేపీలో చేరికపైనే వివేక్ అమిత్ షాతో చర్చించినట్టుగా తెలుస్తోంది. వివేక్ బీజేపీలో చేరాడం ఖరారైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆషాఢ మాసం ముగిసిన తర్వాత వివేక్ బీజేపీలో చేరనున్నారని సమాచారం.
టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని.. అయితే ప్రస్తుతం ఆషాఢ మాసం కావడంతో వారు తమ చేరికను వాయిదా వేసుకుంటున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసం ముగిసిన తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment