సాక్షి, హైదరాబాద్ : పెద్దపల్లి మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారుడు గడ్డం వివేకానంద తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు షాక్ ఇచ్చారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్‌డ్ సీటు బరి నుంచి తనను తప్పించిన నేపథ్యంలో వివేక్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శుక్రవారం సీఎం కేసీఆర్‌కు పంపారు. పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఆశించిన వివేక్.. ఆ సీటు తనకు కాకుండా కొత్తగా పార్టీలో చేరిన వెంకటేష్ నేతకు కేటాయించటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే తన పదవికి రాజీనామా చేశారు. కాగా తన రాజకీయ భవిష్యత్ కార్యచరణపై వివేక్ ఎలాంటి స్పష్టత నివ్వకపోవటం గమనార్హం.
చదవండి : వివేక్ ఔట్.. వెంకటేశ్‌కే టికెట్
అన్న రాజకీయాల కోసం.. తమ్ముడి తప్పటడుగులు!
కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన వివేక్
Published Fri, Mar 22 2019 9:56 PM | Last Updated on Fri, Mar 22 2019 9:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment