మంత్రి సీతక్క
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్‌చార్జిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు చేశారు. ఇన్‌చార్జి మంత్రిగా ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పథకాలు, పాలన తీరుపై సమీక్షలు, సమావేశాల నిర్వహణ, ప్రజాపాలనపై పర్యవేక్షణ చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాలో జరిగే ప్రభుత్వ వ్యవహారాలన్నీ సమన్వయం చేస్తారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె ఇన్‌చార్జి మంత్రిగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం ఎస్టీ రిజర్వు కావడంతో ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ములుగు ఎమ్మెల్యేను సీతక్కను జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment