న్యాయవాదుల హత్య కేసు: వామన్‌రావు ఆడియో వైరల్‌ | Lawyer Couple Murder Case: Vaman Rao Audio Tape Goes Viral | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల హత్య కేసు: వామన్‌రావు ఆడియో వైరల్‌

Feb 28 2021 12:04 PM | Updated on Feb 28 2021 12:33 PM

Lawyer Couple Murder Case: Vaman Rao Audio Tape Goes Viral - Sakshi

పోటీ చేస్తే నాకు ఇబ్బంది అవుతుందని శ్రీధర్ బాబు శరణు కోరాడని, ఆయన అనుభవిస్తున్న పదవి తాను పెట్టిన బిక్షే అంటూ వామన్ రావు కామెంట్ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్ రావు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం సృష్టిస్తుంది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై గట్టు వామన్‌ రావు మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రీధర్ బాబు తనను అవమానపర్చాడని, నీతిలేని వ్యక్తి అని వేరే వ్యక్తితో వామన్ రావు చెప్పుకొచ్చాడు.

20 ఏళ్ళుగా దుద్దిళ్ల శ్రీపాద రావు కుటుంబానికి దూరంగా ఉన్నానని, నేనంటే ఏమిటో చూపిస్తానని తెలిపారు. నీవు పోటీ చేస్తే నాకు ఇబ్బంది అవుతుందని శ్రీధర్ బాబు శరణు కోరాడని, ఆయన అనుభవిస్తున్న పదవి తాను పెట్టిన బిక్షే అంటూ వామన్ రావు కామెంట్ చేశారు. పుట్ట మధు, శ్రీధర్ బాబు బాధితులు ఎందరో ఉన్నారని వారంతా మీకు అండగా నిలుస్తారని మరో వ్యక్తి వామన్ రావుతో చెప్పారు. చాలా రోజుల క్రితం రికార్డు అయిన ఆడియో ఇప్పుడు బయటికి రావడం అందరినీ ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేస్తోంది.

చదవండి: 
న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు
సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement