సిద్దిపేట జోన్ ,న్యూస్‌లైన్: అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించి తెలంగాణ ప్రక్రియను అడ్డుకునేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మరోకుట్రకు తెరతీస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన తొలిసారిగా సొంత జిల్లా కరీంనగర్‌కు వెళుతూ సిద్దిపేట మండలం పొన్నాల వద్ద మాట్లాడారు. తెలంగాణ బిల్లును శాసన సభలో అడ్డుకునే క్రమంలోనే శాసన సభ వ్యవహరాలశాఖ మంత్రి పదవి నుంచి తనను తప్పించారన్నారు. మరోవైపు శాసన సభ సమావేశాలను పొడిగించి తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకునేందుకు సీఎం మరోకుట్రకు తెరలేపుతున్నారన్నారు.
ఈ నెల 23 అసెంబ్లీ సమావేశాలకు చివరి గడువని, అయినప్పటికీ సమావేశాలను పొడిగించాలని సీఎం చేస్తున్న కుట్రను తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు అడ్డుకొవాలన్నారు. శాసన సభలో సీమాంధ్ర ప్రజల సమస్యలను చర్చ సందర్భంగా అసెంబ్లీ దృష్టికి తీసుకురావాలని సీమాంధ్ర శాసన సభ్యులకు విజ్ఞప్తి చేశారు. తన రాజీనామా వ్యక్తిగతం కాదన్నారు. ప్రజ లందరి కోరిక మేరకే రాజీనామా చేశానన్నారు. కిరణ్ మంత్రి వర్గంలో కొనసాగడం ఇష్టం లేక పదవిని వదులుకున్నానన్నా రు. ఆయన సీఎంగా ఉన్నంత వరకు తెలంగాణ మంత్రులు ఇమడడం కష్టమన్నారు.
తెలంగాణ కోసం, వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధినేత్రి సొనియాగాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్‌సింగ్ రాష్ర్ట విభజన విషయంలో స్పష్టంగా ఉన్నారన్నారు. తెలంగాణను అడ్డుకొవాలని చూస్తే ఈ ప్రాంత ప్రజలు ఎవరినీ క్షమించరని పరోక్షంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాం ధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని దీనిని సహించలేకనే మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. సమావేశంలో ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, పీసీసీ కార్యదర్శి గంప మహేందర్‌రావు పాల్గొన్నారు.
శ్రీధర్‌బాబుకు ఘన స్వాగతం
మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలి సారి జిల్లాకు వస్తున్న మంత్రి శ్రీధర్‌బాబుకు ఆదివారం పొన్నాల శివారులో కాంగ్రెస్ కార్య కర్తలు ఘనస్వాగతం పలికారు. సిద్దిపేట, సిరి సిల్ల నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పొ న్నాల వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మం త్రి శ్రీధర్‌బాబు ప్రసంగించారు. అంతకు ముం దు కార్యకర్తలు మంత్రిని, ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఓపెన్‌టాప్ జీపులో మంత్రి, ఎంపీని కరీంనగర్ జిల్లా సరిహద్దుల వరకు ఊరేగించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ , పీసీసీ కార్యదర్శి గంప మహేందర్‌రావు, జిల్లా అధికార ప్రతినిధి సికిందర్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ సాకి అనంద్‌తో పాటు సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్‌వర్మ, జీవన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఖలీం, దాసరి రాజు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావుతో పాటు వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముం దు స్థానిక రంగధాంపల్లి వద్ద తెలంగాణ ఆమరవీరుల స్థూపం వద్ద మంత్రి శ్రీధర్‌బాబు, ఎం పీ పొన్నం ప్రభాకర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో వంగరి నాగరాజు, రామకృష్ణగౌడ్, రాజు, యూసుఫ్, ఖలీం, విజయ్, వంశీ, షఫీ, రమేష్, వర్మ, వినయ్, సలీంలు పాల్గొన్నారు.
కిరణ్ మంత్రివర్గంలో ఇమడలేకే రాజీనామా చేశా
Published Sun, Jan 12 2014 11:46 PM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM
Advertisement
Advertisement