బాబుకు మైండ్ పోయింది: గుత్తా
నల్లగొండ: టీడీపీ అధినేత చంద్రబాబు రెండుసార్లు అధికారం కోల్పోయి మతిభ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఉండదని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కుట్రపూరితంగానే మంత్రి శ్రీధర్‌బాబును తొలగించారని ఆరోపించారు.
శాసనసభా వ్యవహారాల శాఖను దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నుంచి తప్పించి మరో మంత్రి సాకే శైలజానాథ్‌కు అప్పగించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అయితే హైకమాండ్ వ్యూహం మేరకే శ్రీధర్‌బాబు శాఖ మార్పు జరిగిందని ప్రచారం జరుగుతోంది. విభజన బిల్లుపై చర్చ సాఫీగా జరిగేలా చూసేందుకు అధిష్టానం అనుమతి తీసుకునే కిరణ్ మార్పు చేపట్టినట్టు తెలుస్తోంది.