ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో మేరియో సంస్థ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణ దళాలకు అవసరమయ్యే ఆధునిక ‘గింబల్స్’తయారీ పరిశ్రమను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. హైదరాబాద్‌కు చెందిన హెచ్‌సీ రోబోటిక్స్ ఫ్రెంచ్ కంపెనీ మేరియోతో కలిసి ఆధునిక గింబల్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ కంపెనీ మేరియోకు చెందిన అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందం సంస్థ సీఈవో రెమీప్లెనెట్ నేతృత్వంలో శుక్రవారం మంత్రిని కలిసి హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిని తెలియజేసింది.
హైదరాబాద్‌లో మేరియో కార్యకలాపాలకు ప్రభుత్వపరంగా మద్దతును ఇస్తామని మంత్రి హామీనిచ్చారు. మేరియో ప్రతినిధి బృందం భారత పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ అధికారులతోపాటు ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలతో సమావేశమైంది. శ్రీధర్‌బాబును కలిసిన ప్రతినిధి బృందంలో హెచ్‌సీ రోబోటిక్స్ సీఈవో వెంకట్ చుండి, డైరెక్టర్ డాక్టర్ రాధాకిషోర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment