
మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌బాబు
కరీంనగర్: ప్రజలు మార్పు కోరుకొని, కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, తాము పాలనలో మార్పు చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తుంచుకుంటామని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదివారం తొలిసారి మంథనికి వెళ్తూ మార్గమధ్యలో కరీంనగర్‌కు చేరుకున్న ఆయనకు పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ లక్ష్యాలు, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో వాటిని బీఆర్‌ఎస్ విస్మరించిందని ఆరోపించారు. అందుకే ప్రజలు ఆ పార్టీని గద్దెదించారన్నారు. పీసీసీ నాయకుడు వైద్యుల అంజన్‌కుమార్, ఎండీ.తాజ్, సమద్ నవాబ్, కమ్రొద్దీన్, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఇవి చదవండి: ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా! : మేయర్ వై.సునీల్‌రావు