ఇందిరాచౌక్‌లో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
ఇందిరాచౌక్‌లో కాంగ్రెస్ ఆందోళన
కరీంనగర్: కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని నరేంద్రమోదీ కుట్ర పన్నారని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. ఆదాయపన్ను పేరిట కాంగ్రెస్‌పార్టీని వేధించడాన్ని నిరసిస్తూ పీసీసీ పిలుపు మేరకు శనివారం నగరంలోని ఇందిరాచౌక్‌లో ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే కుట్రతోనే ఎన్నికల వేళ రూ.1820 కోట్లు ఆదాయ పన్ను కట్టాలని నోటీసు ఇచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మోదీని ఓడగొట్టడం ఖాయమని, ఓటమి భయంతోనే కాంగ్రెస్‌పై కుట్రలు చేస్తున్నారన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్, రహమత్ హుస్సేన్, మునిగంటి అనిల్, శ్రావణ్‌నాయక్, కొరివి అరుణ్‌కుమార్, పెద్దిగారి తిరుపతి, చర్ల పద్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment