సభ సంకేతాలతో నడుస్తోంది  | Duddilla Sridhar Babu Fires On KCR | Sakshi

సభ సంకేతాలతో నడుస్తోంది 

Jul 19 2019 2:02 AM | Updated on Jul 19 2019 2:02 AM

Duddilla Sridhar Babu Fires On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని.. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లను నొక్కేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేసిన అనంతరం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సభ  సంకేతాలతో నడుస్తోందని ఆరోపించారు.  సీఎం కేసీఆర్‌ నియంత పోకడలను అనుసరిస్తున్నారని.. ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి చేటు చేస్తాయని ఆందో ళన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో తాగు, సాగు నీటి, రైతు, విద్యార్థుల సమస్యలు పక్కనబెట్టి మున్సిపల్‌ చట్ట సవరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమివ్వడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరముందని, శాసనసభ సమావేశాల గడువును పొడిగించాలని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement