
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకునే పనిలో పడ్డారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు శనివారం తన నివాసంలో విందు ఇచ్చిన ఆయన ఆ విందుకు హాజరుకాని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని ఆదివారం కలిశారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హైదరాబాద్‌లోని గండ్ర నివాసానికి వెళ్లిన భట్టి.. అక్కడ చాలా సేపు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా గండ్ర పార్టీ మారే అంశంపై చర్చ జరిగింది. దీన్ని ఖండించిన గండ్ర తాను పార్టీ మారేది లేదని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని భట్టికి హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితు లు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి వీరు చర్చించినట్లు సీఎల్పీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment