రోడ్డుపై ఎదురుగా వచ్చిన వాహనం బలంగా ఢీకొడితే ఇలా జరిగిందా? ప్రమాదవశాత్తు బోల్తా పడిపోయిందా?.. అనేది సందేహమా?. ఇది ఈదురుగాలులు సృష్టించిన బీభత్సం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు స్థానిక డాక్టర్ అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ చేసిన వేముల మల్లికార్జున్‌రావు కారు గాలికి కొట్టుకుపోయి ఇలా బోల్తాపడింది.
1/6
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డు బుధవారం మిర్చి బస్తాలతో కళకళలాడింది. దాదాపు 1.2 లక్షల మిర్చి బస్తాలు విక్రయానికి వచ్చాయి. ప్రస్తుత సీజన్‌లో ఇదే రికార్డు స్థాయి అని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
2/6
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో అంబులెన్స్‌లోనే నిరీక్షిస్తున్న కరోనా బాధితులు
3/6
స్వగ్రామంలో ఉపాధి కరువై దుబాయ్ వెళ్లిన గల్ఫ్ కార్మికులకు వేతన కష్టాలు మొదలయ్యాయి. మూడు నెలలుగా వేతనాలు లేక, తిండికి కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో తెలంగాణకు చెందిన 17 మంది కార్మికులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
4/6
కోవిడ్‌తో బాధపడుతున్న తన తల్లికి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్ కోసం ఢిల్లీలోని ఫిల్లింగ్ షాపు వద్ద శృతి సాహా మంగళవారం రాత్రి నుంచి వేచి చూస్తున్నారు. ఈలోగా ఆమె తల్లి మరణించారన్న వార్త తెలియగానే ఇలా కుప్పకూలి తీవ్రంగా రోదించారు.
5/6
కర్ణాటకలో బుధవారం నుంచి లాక్‌డౌన్ మొదలైంది. దీంతో చిక్‌మగళూర్‌లో వెలవెలబోతున్న రోడ్లు
6/6
కేరళలోని కొచ్చిలో కోవిడ్ రోగులకు అవసరమైన ఆహార పదార్థాల ప్యాక్ చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment