సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్ : ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 15 వేల ఎకరాల భూమి పంపిణీ చేసినట్లు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. సత్తుపల్లిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో 568 మంది లబ్ధిదారులకు 711.25 ఎకరాలకు సంబంధించిన పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి పొందిన వారికి రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాం కర్లతో సమావేశాలు నిర్వహించామన్నారు.
వచ్చే ఖరీఫ్‌లో రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇందిర జలప్రభ ద్వారా కూడా ఈ భూముల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. రోడ్లపై ఫుల్‌వీల్స్‌తో ట్రాక్టర్లు తిరగటంతో రోడ్లు మరమ్మతులకు గురవుతున్నాయని, అలా తిరగకుండా ఉండేందుకు జిల్లాస్థాయిలో అధికారులతో సమావేశాలు ఏ ర్పాటు చేసి చర్యలు చేపడతామని వివరించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సత్తుపల్లిలో భూమిని గుర్తించామని, త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. రచ్చబండలో వచ్చిన సమస్యలన్నీ ఆన్‌లైన్ చేసి పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెలాఖరులోగా వికలాంగుల శిబిరా లు పూర్తి అవుతాయని, 20 నుంచి 40 శాతం ఉన్న వికలాంగులకు కూడా పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిరుపేదలకు భూమిపై హక్కులు కల్పించటం శుభ పరిణామన్నారు. సత్తుపల్లి మండలం యాతాలకుంటలో గిరిజనులకు, అటవీ శాఖకు మధ్య భూ వివాదం సాగుతోందని, దీనిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ సంజీవరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, తహశీల్దార్లు జి.నర్సింహారావు, అమర్‌నాథ్, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
15 వేల ఎకరాల భూపంపిణీ
Published Sat, Dec 28 2013 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement