రేపు సీఎం జగన్‌ చేతుల మీదుగా భూ బదిలీ పత్రాలు పంపిణీ | Distribution of land transfer documents in Prakasam district | Sakshi
Sakshi News home page

రేపు సీఎం జగన్‌ చేతుల మీదుగా భూ బదిలీ పత్రాలు పంపిణీ

Published Thu, Feb 22 2024 9:24 PM | Last Updated on Thu, Feb 22 2024 9:48 PM

 Distribution of land transfer documents in Prakasam district - Sakshi

అమరావతి:  పేద అక్క చెల్లమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ.. రికార్డు స్థాయిలో 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అందించడమే గాక దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరు మీదనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం.

సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం పంపిణీ

ప్రకాశం జిల్లా ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రేపు(శుక్రవారం) 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం భూ బదిలీ పత్రం, కట్టుకోడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి, ఆ పత్రాలు  పంపిణీ చేయనుంది సీఎం జగన్‌ ప్రభుత్వం

దీంతోపాటు 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' క్రింద రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఆ పేద అక్కచెల్లెమ్మల పేరు మీదుగానే సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్ కూడా చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించే కార్యక్రమాన్ని రేపు ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. 

రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ ద్వారా కలిగే ప్రయోజనాలు

  • పదేళ్ల తర్వాత ఇంటి స్థలంపై అన్ని హక్కులు ఉండేలా లబ్ధిదారుల పేరిట గ్రామ/వార్డు సచివాలయాల్లోనే, ఇప్పుడే ఉచితంగా స్థలాల రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ కూడా అందజేత
  • రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ఇప్పటికే దాదాపు 15 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి.. శరవేగంగా మిగిలిన రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి

  • గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (జెఎస్ఆర్వో) డేటాబేస్లో వివరాలన్నీ పదిలం.. ఎప్పుడైనా ఈ జెఎస్ఆర్వోలలో సర్టిఫైడ్ కాపీ పొందే అవకాశం.. ఫోర్జరీ గానీ, ట్యాంపర్ చేయడానికి గానీ ఆస్కారమే ఉండదు
  • పదేళ్ల తర్వాత ఆటోమేటిక్ గా క్రయ, విక్రయ, దాన, వారసత్వ హక్కులతో సహా పూర్తి హక్కులు.. అత్యవసర సమయాల్లో ఇంటిని అమ్ముకునే వీలు.. అమ్ముకునే సమయంలో ఎన్వోసీ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు

ఎలాంటి లింకు డాక్యుమెంట్ల అవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. శుక్రవారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లు, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నారు. అర్హులైన 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నారు,  మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ చేసి రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్స్‌ను అందజేయనున్నారు.  భూమి కొనుగోలు, జగనన్న టౌన్ షిష్‌ల అభివృద్ధికి రూ.210 కోట్లు, లే అవుట్‌ల అభివృద్ధికి రూ. 21.33 కోట్లు సీఎం జగన్‌ ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement